DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏ ఫంక్షన్ చెయ్యాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పదు

*కొవిడ్  కంట్రోల్ పై శ్రీకాకుళం కలెక్టర్ అవిశ్రాంత కృషి* 

*జిల్లా కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ నంబరు – 9491222122*

*ఉబ్బసం, జలుబు, లాంటి వివరాలకు-  9440512447*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 19, 2020 (డిఎన్ఎస్):* జిల్లాలో ఎలాంటి  వేడుకలు (ఫంక్షన్ లు)

నిర్వహించుకోవాలన్నా, నిర్వాహకులు ముందస్తుగా జిల్లా అధికారుల అనుమతి పొందాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేసారు. కోవిడ్ 19 పై మండల అధికారులతో జిల్లా కలెక్టర్ నివాస్ శుక్ర వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో వివిధ సందర్భాల్లో వేడుకలు నిర్వహించుకుంటున్నారని, వాటిలో కరోనా నిబంధనల

ప్రకారం 50 మంది కంటే ఎక్కువ ఉండరాదని అయినప్పటికి ఎక్కువ మంది హాజరు అవుతున్నట్లు సమాచారం అందుతుందని చెప్పారు. వేడుకలు ఎవరు నిర్వహించినా అనుమతి తీసుకోవాలని, అనుమతి తీసుకోనివారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ఒక సాఫ్ట్ వేర్ తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. పలాసలో హైదరాబాదు నుండి వచ్చిన ఒక

వ్యక్తి వలన కరోనా పాజిటివ్ కేసు సోకినట్లు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. బయట నుండి వస్తున్న వ్యక్తుల వివరాలు తెలియజేయాలని ఆయన అన్నారు. గ్రామాల్లో తెలియజేస్తున్నారని, పట్టణాలలో ఎవరూ తెలియజేయడం లేదని కలెక్టర్ తెలిపారు. ఏ ప్రాంతంలోనైనా కొత్త వ్యక్తి వస్తే వారి వివరాలు తెలియజేయాలని కోరారు. ఇంటింటి సర్వే పక్కాగా

నిర్వహించి, ఎవరైనా వచ్చినా గుర్తించాలని ఆయని ఆదేశించారు. హోమ్ క్వారంటీన్ లో ఉన్న వ్యక్తులను పర్యవేక్షణ చేయాలని, సారవకోట మండలంలో హోమ్ క్వారంటీన్ ఉల్లంఘన చేసిన వ్యక్తికి క్రిమినల్ కేసు నమోదు చేసామని పేర్కొన్నారు. బయటకు వస్తున్న ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, మాస్కు ధరించని వారికి రూ.100 అపరాధ రుసుం విధించాలని

ఆదేశిస్తూ,  మాస్కులు వారికి పంపిణీ చేయాలని సూచించారు. కూరగాయలు, చేపలు, మాంసం మార్కెట్లు బహిరంగ ప్రదేశాలకు మొదటలోనే మార్చామని, ప్రస్తుతం భౌతిక దూరం పాటించడంలో కొంత మేర అశ్రద్ద కనిపిస్తుందని తెలిపారు. మద్యం దుకాణాలు వద్ద భౌతిక దూరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ స్పష్టం చేసారు. ఇతర దుకాణాల వద్ద 5 గురు కంటే ఎక్కువ మంది

ఉండరాదని తెలిపారు. ఐదు గురు కంటే ఎక్కువ మంది ఉంటే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లాక్ డౌన్ లో చక్కగా చేసామని,  ఇప్పుడు మరింత కీలక తరుణం వచ్చిందని ప్రత్యేక శ్రద్ధతో ప్రస్తుత పరిస్థితుల్లో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాకు ఎక్కువ మంది వలస కూలీలు వస్తారని ఊహించామని, దానికి అనుగుణంగా చర్యలు

చేపట్టడంతో జిల్లాకు వచ్చిన వారికి తగిన సౌకర్యాలు కల్పించగలిగామని చెప్పారు. ప్రస్తుతం సామాజిక వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉద్యోగులు పూర్తి స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరిలో పాజిటివ్ ఉండవచ్చని భావించి వ్యవహరించాలని అన్నారు. జిల్లాలో వారంలో 2 వందల కేసులు పెరిగి, 4 వందలకు చేరుకుందని

అన్నారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రుల్లో తీవ్రత ఉన్న కేసులకు చికిత్సను అందించి మిగిలిన వారికి ఇంటి వద్దనే అందించుటకు నిర్ణయించామని చెప్పారు. జిల్లాలో 17 కేసులకు ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నామని, 300 మందికి కోవిడ్ కంట్రోల్ రూమ్ లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 2 వేల మందికి చికిత్స అందించుకు సౌకర్యాలు

సిద్ధం చేసామని కలెక్టర్ స్పష్టం చేసారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల వివరాలు తెలియజేయాలని కోరారు. సాధారణ రుగ్మతలు ఉన్నవారు, కరోనా లక్షణాలు ఉన్నావారు  గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా ఆర్.ఎం.పి ల వద్దకు వెళుతున్నట్లు సమాచారం ఉందని కలెక్టర్ అన్నారు. ఆర్.ఎం.పి లతో సమావేశం నిర్వహించుటకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.

కరోనా సమాచారంను జిల్లా కంట్రోల్ రూమ్ 9491222122 కు తెలియజేయాలని సూచించారు. ఉబ్బసం, జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, గొంతు నొప్పి వంటి రుగ్మతలు (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ – సారి) తీవ్రంగా ఉండి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు చేరిన కేసుల వివరాలు 9440512447 (మురళి)కి తెలపాలని సూచించారు. ఈ కేసులు జిల్లాలో ఇప్పటికి 87 ఉన్నాయని

చెప్పారు. జిల్లాలో కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించుటకు అవగాహన కల్పించాలని అన్నారు. కరోనా వైరస్ గూర్చి అవగాహన కల్పించి స్వీయ రక్షణ చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమంలో

జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సహాయ కలెక్టర్ ఎం.నవీన్, డిఆర్ఓ బలివాడ దయానిధి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.చెంచయ్య, డిసిహెచ్ఎస్ డా బి.సూర్యారావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.నరేష్,  డీఆర్డీఏ పిడి బి.నగేష్, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఎస్డిసి బి.శాంతి, డిఎస్పి ఏ.సత్యనారాయణ, జిల్లా నీటి

యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు, డిటిసి డా.వడ్డి సుందర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam