DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువులను తొక్కివేయడానికేనా  సెక్యులరిజం ? : భజరంగ్ దళ్

ఓట్లు అడుక్కోడానికి రాముడు కావాలి, తిట్టడానికీ రాముడే కావాలి 

విశాఖపట్నం, జులై 9 , 2018 (DNS Online ): హిందువులను తొక్కివేయడానికేనా ఈ దేశం లో సెక్యులరిజం అనేది ఉంది

అని భజరంగ్ దళ్, ఇతర హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు హిందూ ద్రోహులు శ్రీరాముణ్ణి నోటికి వచ్చిన

దుర్భాషలాడడాన్ని ఖండిస్తూ ధర్మాగ్రహ పాదయాత్ర చేపట్టిన స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడాన్ని అందరూ తప్పుపట్టారు.ఎన్నికల్లో ఓట్లు అడుక్కోడానికి

మాత్రమే రాజకీయ పార్టీలకు శ్రీరాముడు కావాలని రాజకీయ పార్టీలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశం లో సెక్యులరిజం అనేది కేవలం అన్యమతస్తులకి రక్షణ గానే

ఉందని, హిందువులకి అన్యాయం జరిగితే అది ఈదేశం లో ఎక్కడా కనపడదని ఆవేదన వ్యక్తం చేసారు. ఒక తుచ్ఛుడు శ్రీరాముణ్ణి తిడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు

కళ్ళు మూసుకు పోయి, అన్యమతస్తులకి కొమ్ము కాస్తున్నాయన్నారు. తుచ్ఛుని పై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ల లో

ఫిర్యాదు చేసిన ఈ రోజు వరకూ అతని పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా విఐపి సౌరకార్యాలు కల్పిస్తున్నారని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పై

మండిపడుతున్నారు. 

రాజకీయ పార్టీలని బహిష్కరించాలి : హిందూ సంఘాలు. 
ఓట్లు కోసం అడుక్కునే రాజకీయ పార్టీలను హిందూ ప్రజలంతా బహిష్కరించాలని హిందూ సంఘాల

ప్రతినిధులు పిలుపునిచ్చారు. శ్రీరాముణ్ణి తిట్టిన వాడిపై ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యకుండా, అతనికి నైతికంగా మద్దతు ప్రకటించిన ఈ రాజకీయ పార్టీలకు ఇకపై హిందువు

బంధులను ఓట్లు అడుక్కునే హక్కు లేదని, తక్షణం అన్ని రాజకీయ అభిమానులు à°—à°¾ ఉన్న హిందువు బంధులంతా కళ్ళు తెరవాలని పిలుపునిచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam