DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా ని కట్టడి చేసి గర్భిణికి రక్షణ, సుఖ ప్రసవం

కరోనాను పారద్రోలి ... పసికందు స్వేచ్ఛా వాహిణిలో . . .

శ్రీకాకుళం వైద్యుల కృషికి కలెక్టర్ నివాస్ అభినందనలు

(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)

శ్రీకాకుళం, జూన్ 22, 2020 (డిఎన్ఎస్): కోవిడ్ 19 (కరోనా) ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అయితే ధైర్యం, స్ధైర్యం ఉంటే కరోనాను తరిమి

కొట్టవచ్చని ప్రపంచంలోని అనేక కేసులు తెలియజేస్తున్నాయి. అదే కోవలో సరస్వతి నిరూపించింది. కరోనాపై విజయం సాధించింది. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం కందిస గ్రామానికి చెందిన కె.సరస్వతి నిండు గర్భిణి. ఉపాధి కొరకు భర్తతో కలసి హైదరాబాదు వెళ్ళడం జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఎటూ తోచని స్ధితిలో

స్వగ్రామానికి వచ్చి ఉన్న చిన్నపాటి వ్యవసాయం చేసుకుని బ్రతుకుదామని నిశ్చయించుకున్నారు. ఎక్కడ, ఏ విధంగా అంటుకుందో మాయదారి మహమ్మారి కరోనా భారీన పడింది నిండు గర్భిణి సరస్వతి. కోరనా సోకిన లక్షణాలు కూడా కనిపించలేదు. జిల్లాకు జూన్ 1వ తేదీన చేరుకోగానే, జిల్లా సరిహద్దు పైడి భీమవరం వద్ద నమూనాలు సేకరించి హోమ్ క్వారంటీన్ కు

పంపించారు అధికారులు. జూన్ 4వ తేదీ రాత్రి నాటికి అందిన నమూనా ఫలితాల్లో కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబం యావత్తు కంగారు పడింది. అధికారులు తక్షణం స్పందించి జిల్లా కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. 
    జిల్లా యంత్రాంగం సైతం ముందుగానే ఊహించి గర్భిణీలు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధతో ప్రణాళికలు రూపొందించి నిపుణులైన

వైద్యులను చికిత్సకు సిద్ధం చేసింది. అందులో భాగంగా సరస్వతికి ప్రత్యేక శ్రద్ధతో వైద్య చికిత్స అందించారు. గర్భంలో ఉన్న బిడ్డకు మందుల వలన ఎటువంటి చెడు ప్రభావాలు పడకుండా, సరస్వతికి వ్యాధి నయం చేయడంలో దృష్టి సారించారు. చివరికి సాధించారు. జూన్ 12వ తేదీన పండంటి మగ బిడ్డను ప్రసవించింది. కరోనాను పారద్రోలారు. అవును ... కరోనాను

పారద్రోలారు. పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా వైద్య సేవలు అందించడంతో పసికందుకు నిర్వహించిన కరోనా పరీక్షలలో నెగిటివ్ వచ్చింది. పసికందు స్వేచ్చా వాహిణిలోకి ఆరోగ్యంగా అడుగిడింది. కుటుంబంలో ఆనందాలు నింపింది. చికిత్స సమయంలోనే ప్రసవం జరిగింది. కాని బిడ్డకు కరోనా సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరస్వతి

ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. చికిత్స అందిస్తూ పలుమార్లు నమూనాలు సేకరించి పరీక్షించగా పూర్తిగా కోలుకుని నెగిటివ్ ఫలితం రావడంతో రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. వైద్యుల సూచనల మేరకు స్వగ్రామం చేరుకున్న సరస్వతి ఇంటి వద్ద క్వారంటీన్ పాటిస్తూ వైద్యుల సూచనలు, సలహాలు అనుసరిస్తూ ప్రస్తుతం

ఆరోగ్యంగా ఉన్నారు. 
    కరోనా ఎక్కడ ఎలా సోకింద తెలియలేదు అని సరస్వతి (23) అన్నారు. కరోనా వచ్చిందని నివేదికలలో తేలగా ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనయ్యాం. నెమ్మదిగా తేరుకుని కడుపులోని బిడ్డకు కరోనా సోకకూడదని భగవంతుని ప్రార్ధిస్తూ ముఖ్యంగా బిడ్డ ప్రాణాలకు ఎటువంటి ఆపద రాకూడదని ధైర్యంగా ఆసుపత్రికి వెళ్ళాను.

వైద్యులు, సిబ్బంది ఎంతగానో సహకరించారు. మరింత ధైర్యం వచ్చింది. గుండె నిబ్బరం చేసుకున్నాను. జిల్లా కలెక్టర్ జె నివాస్ గర్భిణీలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేసారని వైద్య సిబ్బంది చెప్పడంతో మరింత బలం వచ్చినట్లు అనిపించింది. ఏమైనప్పటికి సురక్షితంగా కరోనాను జయిస్తూ ఇంటికి చేరుకున్నాం అన్నారు

సరస్వతి. 
    కరోనా ఎలా వస్తుందో తెలియని పరిస్ధితి ఉందని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు కడుక్కోవాలని సరస్వతి సూచించారు. అనవసరంగా బయట తిరగవద్దని, ఇంట్లో ఉండే పసి పిల్లలు, వృద్ధులు, కుటుంబ సభ్యులను ప్రమాదంలోకి నెట్ట వద్దని హితవు పలికారు. 
    కరోనాపై విజయం సాధించిన

సరస్వతిని జిల్లా కలెక్ట్ జె నివాస్ అభిందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam