DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మైనస్ డిగ్రీల చైనా బోర్డర్ లో భారతీయ సైన్యం యోగాసన విన్యాసం

*హిమాలయాల్లో 18 వేల అడుగుల ఎత్తులో భారతీయ యోగ విద్య*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  22, 2020 (డిఎన్ఎస్):* అంతర్జాతీయ యోగ దినోత్సవాన్నిపురస్కరించుకుని ఆదివారం భారత సైన్యం మైనస్ డిగ్రీల ప్రాంతంలో సైన్యం యోగాసనాలను ఆచరించి అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇండో

టిబెటియన్ బోర్డర్ జవాన్ లు 18000 అడుగుల ఎత్తులో యోగాసనాలు సాధన చేసారు. భారత్ చైనా సరిహద్దుల్లో ని లడక్ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించడం తో సైనికులు తమ కాంప్ ల్లో యోగ సాధన చేసారు. హిమాలయ పర్వతాల్లోని 18 వేల అడుగుల ఎత్తులో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం సైనికులు ఎంతోస్ఫూర్తిగా నిలిచారు. సిక్కిం లోని 18 వేల అడుగుల

నుంచి కార్డుంగ్ ల పాస్ వరకూ, బద్రీనాధ్ (ఉత్తరాఖండ్ ) లో 14 వేల అడుగుల ఎత్తులోను, ఈ యోగ సాధన చేశారు. 

లడక్ లోని కారకోరం పాస్ నుంచి అరుణాచల ప్రదేశ్ నుంచి జచెప్ లా వరకూ, సుమారు 3488 కిలోమీటర్ల దూరం వరకూ సైనికులు మోహరించి ఉన్నారు.   
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam