DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పూరి జగన్నాధ పరమాత్మునికి నివేదించే 56 నిత్య నైవేద్యలివే. .

*ఆలయంలో ప్రసాద  తయారీయే  అత్యంత  వైశిష్ట్యం, రహస్య ప్రక్రియ*  

*5 కుండలు ఒకదానిపై ఒకటి ఉంచి, కర్రలతోనే వండే ప్రక్రియ ప్రత్యేకత* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 23, 2020 (డిఎన్ఎస్):* ఆషాఢ శుద్ధ తదియ పూరి జగన్నాధుని రథోత్సవాన్ని పురస్కరించుకుని

స్వామికి నివేదించే నైవేద్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.  సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామివార్లు కొలువై ఉన్న పూరీ  క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీ క్షేత్రమని, శంఖ క్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. 

ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడిని ఆరాధిస్తారు. స్వామి

వారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటను సాక్షాత్‌ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందట, అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. 

గంగ, యమున బావుల్లోని నీటిని ప్రసాదాల తయారీకి వాడతారు. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు

నివేదిస్తారు. 

ప్రసాద తయారీ యే అత్యంత రహస్యం. 

ప్రపంచం లో ఎక్కడా, ఏ ఆలయంలోనూ లేని అత్యంత అరుదైన సంప్రదాయాన్ని పూరి జగన్నాధుని ఆలయంలో ఆచరించడం సంప్రదాయం గా వస్తోంది. ఐదు కుండలను ఒకదాని పై ఒకటి ఉంచి, కట్టెల పొయ్యి పై ఉంచి, మంట పెడితే పైన ఉన్న కుండ ముందుగా ఉడికి, ఆఖరున క్రింద ఉన్న కుండ లోని పదార్థం

ఉడుకుతుంది.  అర్చకులు పైన ఉన్న కుండలోని పదార్ధాన్ని పట్టుకు చూసి, క్రింద కుండ లోని పదార్ధం ఉడికిందో లేదో చెప్పగలగడం కేవలం జగన్నాధుని మహిమే అనేది వారే చెప్తుంటారు. 

ఇక్కడ అత్యంత ఆనంద బాసుదేవా ఆలయంలోని రసోఘర్ (వంటా శాల) జరిగే ప్రక్రియ ప్రపంచం లోని ఏ ఆలయం లోనూ జరగదు. అన్నది వాస్తవం. ఇక్కడ తయారైన ప్రతి

పదార్ధాన్ని జగన్నాధుని మూల విరాట్ కు నివేదనం చెయ్యడం జరుగుతుంది. అక్కడ నివేదన చేసిన వాటినే భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాటిని ఎక్కడ వినియోగించకుండా భూస్థాపితం చేయడం ఆనవాయితీ.  

పూరీలో జగన్నాథ స్వామికి నివేదించే ఛప్పన్న బోగాలేమిటి వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు.

1. అన్నం
/> 2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)
3. దహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)
4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)
5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
6. నేతి అన్నం 
7. కిచిడీ
8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార

కలుపుతారు)
9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)
10. కాజా 
11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)
12. లడ్డు 
13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)
14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)
15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)
16. ఖురుమా

(గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)
17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)
19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు)
21. సువార్‌ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
22. చొడెయి లొడా (గోధుమలు,

నెయ్యి, పంచదారతో చేస్తారు)
23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
27. పూరీ
28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు)
30. దొహిబొరా (పెరుగు గారెలు)
31.

అరిసె 
32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 
34. ఖిరి (పాయసం)
35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు)
36. కోవా 
37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు)
38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు)
39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు)
40. బపుడి ఖొజా

(పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు)
41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి)
43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 
44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 
45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 
46. ఉరద్‌ డల్లి (మినప్పప్పు వంటకం)
47. దాల్మా (కందిపప్పు,

కాయగూరలు కలిపి చేసే వంటకం)
48. మవుర్‌ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం)
49. బేసొరొ (కలగూర వంటకం) 
50. సగొ (తోటకూర వంటకం)
51. పొటొలొ రొసా (పొటల్స్‌/పర్వల్‌ కూర)
52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర)
53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం)
54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు)
55. పిఠా (గోధుమపిండితో చేసే

తీపిరొట్టె) 
56. బైగని (వంకాయలతో చేసే వంటకం)


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam