DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాటి చీకటి కాలానికి కాంగ్రెస్ నేటికీ క్షమాపణ చెప్పలేదు.

*నాటి ఎమర్జెన్సీ చీకటి కోణ పాపాలకు భాద్యత కాంగ్రెస్ దే. .*

*1975 జూన్ 25, ఎమర్జెన్సీ పరిస్థితులపై యువతకు వివరణ*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  25, 2020 (డిఎన్ఎస్):* కేవలం తన పదవి పోతుందన్న దుర్ద తో నాటి ప్రధాని ఇందిర తీసుకున్న ఒక స్వార్ధపూరిత నిర్ణయం యావత్ భారత

దేశాన్ని చీకటి లోకం లోకి తీసుకుపోయిందని, మాజీ ఎంపీ డాక్టర్ కె. హరిబాబు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ దేశం లో 1975  లో విధించిన ఎమర్జెన్సీ ని వ్యతిరేకిస్తూ నిర్వహించే వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో గురువారం సమావేశం నిర్వహించారు. దానిలో భాగంగా గురువారం విశాఖపట్నం బీజేపీ కార్యాలయం లో జరిగిన సమావేశంలో మాజీ

ఎంపీ డాక్టర్ కె. హరిబాబు నాటి పరిస్థితులను అందరికీ మరోసారి గుర్తు చేసారు. 

ఎంపిక చెల్లదు అని కోర్టు తీర్పు కు నిరసనే. . .:

న్యాయస్థానం తన ఎంపీ ఎన్నిక చెల్లదు అని 1975 లో తీర్పు ఇవ్వడంతో సహించలేని నాటి  ప్రధానిగా ఉన్న ఇందిర దేశం మొత్తం అత్యయిక పరిస్థితి ( ఎమర్జెన్సీ) ని ప్రకటించారు.  దాంతో దాదాపు

రెండేళ్ల కాలం పాటు దేశాన్ని అతలాకుతలం చేసేసిన రోజు జూన్ 25. ఆ నాటి చీకటి రోజులను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా చర్చలు, సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. 

1971 పార్లమెంటరీ ఎన్నికల్లో ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఇందిరా గాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని,

ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వినియోగించుకున్నారని కేసు దాఖలుచేశారు. నారాయణ్ తరఫున రాజకీయ నాయకుడు, న్యాయవాది శాంతి భూషణ్ వాదించారు. ఇందిరా గాంధీ ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సివచ్చింది. ఓ ప్రధాని కేసు విచారణలో ప్రశ్నించబడడం అదే తొలిసారి. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్మోహన్ లాల్

సిన్హా ప్రధాని మీద ఆరోపణలు వాస్తవమని తేలిందంటూ కేసు తీర్పునిచ్చారు. ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పునివ్వడమే కాక, ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని రద్దుచేశారు. దీంతో కేవలం తన స్వార్థం కోసమే ఇందిరా దేశాన్ని మొత్తం నరక కూపం లోకి నెట్టేసారన్నారు. 

కానీ భారతదేశం లో జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం

వల్ల దేశం నిరంకుశత్వ పాలనలోకి వెళ్లకుండా అప్పటి ఉద్యమకారులు, ప్రజలు నిరోదించారని తెలిపారు. 1971 బాంగ్లాదేశ్ విమోచనతో శక్తి మంతమైన నాయకురాలుగా ఎదిగిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు 1975 లో ఎమర్జెన్సీ విదించటానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు.లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఉద్యమం, ఇందిరా గాంధీ ఎన్నిక

రద్దు, విద్యార్థుల ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ గారి విజయవాడ పర్యటన, అత్యవసర పరిస్థితి విధింపు తదితర విషయాలు వివరించారు. అలాగే ఎమర్జెన్సీ కాలం లో కొన్ని వ్యవస్థలు సక్రమంగా నడిచినట్లు జరిగిన ప్రచారాన్ని, అరెస్ట్ అయి జైలు లో ఉన్నపుడు కల్పించిన వసతులు, ఎమర్జెన్సీ ఎత్తివేయటానికి కారణమైన ఇంటలిజెన్స్ రిపోర్ట్ గూర్చి,

జనతా పార్టీ ఆవిర్భావం, ఎన్నికలలో గెలుపు తదితర విషయాలను తెలిపారు. 

కనిపించిన ప్రతి వ్యక్తినీ జైళ్ల పాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. లక్షలాది మంది ఉసురు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ నాటి చీకటి రోజులకు, నేటికీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పలేదన్నారు. నాడు జైలు పాలైన వారిలో పత్రికాధిపతులు, న్యాయదేశులు,

ఉన్నత ఉద్యోగులు లక్షలాదిగా ఉన్నారన్నారు. 

బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో రాష్ట్ర కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథ రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.  కెవివివి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam