DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా కట్టడి కై పలాస లో జిల్లా కలెక్టర్, యంత్రాంగం పర్యటన

*జ్వరాల పై సర్వే విస్తృతంగా జరగాలి: కలెక్టర్ నివాస్* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 26, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లాలో జ్వరాలపై విస్తృతంగా పరీక్షలు జరగాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును,

కంటైన్మెంటు జోన్ లలో స్ధితి గతులను పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రభలే సమయం కావడంతో జ్వరాలపై ఇంటింటా సర్వే చేసి జ్వరం ఉంటే కరోనా కేసుగా పరిగణించి వైద్య పరీక్షలు నిర్వహించుటకు చర్యలు చేపట్టాలన్నారు. 60 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు, వివిధ వ్యాధులతో

బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, చేతులు సబ్బుతో గాని, శానిటైజర్ తో గాని శుభ్రపర్చుకోవాలని, భౌతిక దూరం పాటించాలని – ఇవి కరోనా వైరస్ భారీన పడకుండా ప్రాథమికంగా పాటించాల్సిన నియమాలని చెప్పారు. దీనిని ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. 
లాక్ డౌన్ సడలింపుతో ప్రజలు

అనవసరంగా బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. కంటైన్మెంటు జోన్లలో ప్రజలు సూచనలను పక్కాగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. నిత్యావసరాలు, తాగు నీరు, పాలు, పెరుగు వంటి పదార్ధాలు అందేటట్లు చూడాలని ఆయన అన్నారు. కంటైన్మెంటు జోన్లలో ప్రతి ఒక్కరి నమూనా సేకరించి పరీక్షంచాలని ఆదేశించారు.

వీరు పలాస లో లాక్డౌన్

పరిస్థితుల పై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.  కరోనా పాజిటివ్ కేసులు, పెండింగ్ రిపోర్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాంపిల్ కలక్సన్ సామర్థ్యం పెంచాలని అన్నారు.  ప్రతి ఇంటికి కరోనా పరీక్షల సర్వే,  ఫీవర్ క్లీనిక్స్ ఏర్పాటు చేయాలని కోరారు.  పైలట్ ప్రాజెక్ట్ విధానంలో నియోజకవర్గంలో ఏదో ఒక

గ్రామాన్ని సెలెక్ట్ చేసి గ్రామం మొత్తం కరోనా పరీక్షలు చేయించి వాటి ఆధారంగా నియోజకవర్గంలో  కరోనా పరిస్థితులపై అంచనాకు రావచ్చని అన్నారు.  పలాస ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం అక్కడ కోవిడ్ స్పెషల్ వార్డు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.
 అదే విధంగా ప్రస్తుతం ఉన్న డయాలిసిస్ సెంటర్ తో పాటు అదనంగా మరొక 5

బెడ్డులతో మరొక డయాలిసిస్ సెంటర్ ఏర్పాట్లు పూర్తయ్యాయని వారం రోజుల లోగా ప్రారంభిస్తామని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించి కరోనా వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్, డిప్యూటీ జిల్లా వైద్యాధికారి తదితరులు పలాస

శాసనసభ్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు, టెక్కలి రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కోషోర్, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డా.ఎం.చెంచయ్య, మునిసిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam