DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసు రక్షణ కోసం దశ సూత్రాలు అమలు పై ఎస్పీ సమీక్ష

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 26, 2020 (డిఎన్ఎస్):*  కొరోనా  వైరస్ బారిన పడకుండా ఎలా రక్షించబడాలి అనేఅంశం పై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ పది ప్రధాన సూత్రాలను తెలియచేసారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డిఎస్పి, సిఐ మరియు ఎస్ఐ లతో నిర్వహించిన

వీడియో కాన్ఫరెన్స్ లో అయన తెలిపారు. 

కరొనను కట్టడి చేయడంలో పోలీసులు  పాత్ర చాలా ముఖ్యమైనదని వైరస్ బారిన పడిన వారిని ఆస్పత్రికి తరలించడం నుండి ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ గా ఏర్పాటు చేయడం...అంతర్ రాష్ట్ర జిల్లా సరిహద్దు లో విధులు నిర్వహిస్తూ ఉంటారు.  ఇలాంటి సమయంలో పోలీసులు కూడా వైరస్ బారిన

పడుతున్నారు. వైరస్ నుంచి పోలీసులు రక్షణ కల్పిస్తూ పోలీస్ స్టేషన్ కు  వచ్చే ప్రజలను అప్రమత్తం చేయడానికి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు దశ సూత్రాలు అమలు కార్యక్రమాన్ని జూము వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. 

1.ప్రతి సబ్ డివిజన్ పరిధిలో గల సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఆవరణ  ప్రాంతంలో ప్రజలు ఏదో

కారణం చెప్పి బహిరంగంగా తిరగరాదుని  అత్యవసర సమయంలోనే ప్రజలు వారి సమస్యలుతెలియపరచు కోవాలి.

2.ప్రతి పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ వాష్, శానిటేషన్ స్టాండ్ ఏర్పరచాలి ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ కు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించి శానిటేషన్ చేసుకొని పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించే విధంగా ఏర్పాటు

చేయాలి .

3.కరోనా వైరస్ నివారణ దృశ్య ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేకమైన రిసెప్షన్ సెంటర్ ను ఏర్పర్చి సామాజిక దూరం పాటించే విధంగా మార్కింగ్  వేసి ప్రతి వ్యక్తి కూడా మాస్కులు ధరించి పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదులను స్వీకరించే విధంగా చూడాలి.ఈ రిసెప్షన్ సెంటర్ లో వచ్చే దారి వెళ్లే దారి వేరు వేరుగా ఉండి

అక్కడ ప్రత్యేకమైన రిజిస్టర్ ఏర్పాటు చేసి  ఫిర్యాదులను, ఫిర్యాదుదారులు వివరాలను  వివరంగా రిజిస్టర్లో నమోదు చేయాలి.

4.కరోనా వైరస్ ప్రభావం దృశ్య ఫిర్యాదుదారులు ప్రజలు పోలీస్ స్టేషన్ లో  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ కి వెళ్లి వారి యొక్క సమస్యలను తెలియజేసికోవాలి.కొత్త వ్యక్తులు పోలీస్

స్టేషన్ లోపల కి వెళ్లాలంటే ఉన్నతాధికారులకు అనుమతితోనే వారి యొక్క ఆవశ్యకత బట్టి వెళ్లాలి.  

5.పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూన్న ఇండోర్ స్టాఫ్  రైటర్, అసిస్టెంట్ రైటర్ కంప్యూటర్, కోర్ట్ కానిస్టేబుల్  రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించాలని.కుర్చీలు టేబుళ్లు కంప్యూటర్లు కీబోర్డు ప్రతిరోజు

శానిటేషన్ చేయించుకోవాలని సూచించారు.  కంటోన్మెంట్ జోన్ లో విధులునిర్వహించే సిబ్బంది షిఫ్ట్ వైస్ గా విధులు నిర్వహించాలని తగు సూచనలు చేసిను.ఆ ప్రాంతం లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హ్యాండ్ గ్లౌసు లు తప్పక ధరించాలి.

6.కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు..తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్

రాజస్థాన్ ఢిల్లీ  వైరస్ ప్రభావిత  ప్రాంతంలో సిబ్బంది సెలవులపై వెళ్లరాదని ,సెలవు  పై వెళ్లే సిబ్బంది కి సబ్ డివిజన్ అధికారి తగు సూచనలు చేయాలి.   

7.సర్కిల్ పరిధిలో గల ముద్దాయిని స్టేషన్లో ఉంచాల్సిన పరిస్థితి ఉంటే అలాంటి సమయంలో ముద్దాయి తప్పక మాస్కు ధరించి  విధంగా చూడాలి.ముద్దాయి కి రాత్రిపూట

గార్డ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  ముద్దాయికి వీలైనంత త్వరగా కోర్టులో ప్రవేశ పెట్టే, ప్రవేశపెట్టేటపుడు ముద్దాయి మరియు ఎస్కార్ట్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి .

8.బందోబస్తు, క్రైమ్ ,శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధుల్లో శారీరకంగా దృఢంగా ఉండే  సిబ్బందిని నియమించాలి .ఇతర జిల్లాలు ఇతర

రాష్ట్రాల బందోబస్తుకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చూడాలి.

9.పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు కూడా కరోనా విషయంపై అవగాహన కల్పించి దూరప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే వారిని తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా చూడాలి.పోలీస్ సిబ్బంది అనవసరంగా మార్కెట్ ఇతర ప్రాంతాలకు తిరగరాదు. కొత్త వ్యక్తులు

ఎవరైనా వస్తే వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి.

10.ప్రతి  రోజు ఉదయం  పోలీస్ స్టేషన్ ని శానిటేషన్  చేయించి అందుకోసం ప్రత్యేకమైన రిజిస్టర్ పెట్టి ఏ రోజు ఎవరు చేస్తున్నారు ఎన్ని గంటలకు చేస్తానురు వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలి.
 ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది

ప్రతిరోజు వ్యాయామం చేస్తూ,మంచి ఆహారం తీసుకోవాలని,బయట విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వారింటి నుంచి భోజనం తీసుకువెళ్లాలని పలు సూచనలు చేస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాను.
.ఈ కార్యక్రమంలో ఎస్ బి సి ఐ లు  శ్రీనివాసరావు, నవీన కుమార్  పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam