DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*కోవిడ్ లో మీడియా సేవలకు నేషనల్ వెబినార్ ప్రశంసలు* 

*నన్నయలో మీడియా జాతీయ వెబినార్ విజయవంతం*

*550 మంది హాజరు, ఆసక్తికరంగా సాగిన వక్తల ప్రసంగం,* 

*నన్నయ వీసీ జగన్నాథరావు, అమర్, బాబీవర్ధన్ ల ప్రసంగం* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  27, 2020 (డిఎన్ఎస్):* కోవిడ్ 19లో మీడియా సామాజిక బాధ్యతగా అందించిన సేవలు

ఎంతో ప్రసంసనీయమని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ మొక్కా జగన్నాథరావు అన్నారు. కోవిడ్ 19 మీడియా సేవలు అనే అంశంపై ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మీడియా సెల్ విభాగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ వెబినార్ ను అయన ప్రారంభించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా  పి.ఆర్.వో పువ్వల ఆనంద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా

ఎల్. శ్రీనివాసరావు, చింతాడ కృష్ణారావు వ్యవహరించారు. 

నన్నయ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ మొక్కా జగన్నాథరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కీలక ఉపన్యాసకులుగా ఆంధ్రప్రదేశ్ ఎయు జర్నలిజం విభాగాధిపతి జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రధాన వక్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ పి.

బాబివర్ధన్ లు హాజరైయ్యారు. 

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో లాక్ డౌన్  విజయవంతం కావడానికి మీడియా విశేషమైన కృషి చేసిందని అన్నారు. వలస కార్మికుల కష్టాలను ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసి అందరి హృదయాలను కదిల్చి వేసి వారిని క్షేమంగా స్వగ్రామాలకు చేరుకోవడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందన్నారు.

కోవిడ్ సమయంలో వెయి కళ్ళుతో ఎదురుచూసిన పాఠకులు, వీక్షకులు, శ్రోతలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ ప్రజలందరిని మీడియా అప్రమత్తం చేసిందన్నారు. 

జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సమాజానికి ఏ విధమైన సమస్య వచ్చిన దానికి ఎదురుగా నిలబడి ప్రజల పక్షాన నిలిచేది మీడియా మాత్రమేనని అన్నారు. కోవిడ్

సమయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీడియా వారధిగా ఉండి సేవలందించిందని తెలిపారు. సమాజానికి నాల్గొవ స్థంబంగా మీడియాకు ప్రాధన్యతనిచ్చారని దానిని బాధ్యతగా నిలబెట్టుకోవలసిన అవసరం ఎంతో ఉందని అన్నారు. కోవిడ్ సోకి తెలంగాణాలో మృతి చెందిన మనోజ్ ఆత్మకు శాంతి చేకురాలని వారి కుటుంబానికి ఆధరణ కలగాలని నివాలర్పించారు.

 ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో విలువలతో కూడిన విభిన్న కోణంలో జర్నలిజం కోర్సును ప్రారంభించాలని అమర్ కోరారు. దీనిపై వీసీ సానుకూలంగా స్పందించి త్వరలో జర్నలిజం కోర్సును ఏర్పాటు చేస్తామన్నారు. 

ఎయు జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ పి. బాబివర్ధన్ మాట్లాడుతూ సమాజానికి కళ్శు, కాళ్ళు మీడియనే అని మీడియా సేవలను

ప్రసంసించారు. విలువలు, నిబంధనలు, పరిమితులు, హద్దులులేని స్వేచ్చతో సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తున్న ప్రజలు పత్రికలను, న్యూస్ చానల్స్ ను మాత్రమే నమ్ముతున్నారని ఆ నమ్మకాన్ని జర్నలిస్టులు ఎప్పుడు కోల్పొకూడదని అన్నారు. 

రిజిష్ట్రార్ బట్టు గంగారావు మాట్లాడుతూ కోవిడ్ కాలంలో మీడియా చేసిన

సేవలను స్మరించేందుకు జాతీయ స్థాయి వెబినార్ ను నిర్వహించిన నిర్వహకులను అభినందించారు. దేశం నలుమూల నుండి 550 మంది జూమ్ యాప్ ద్వారా రిజిస్టేషన్ చేయించుకొని నేషనల్ వెబినార్ లో ఆన్ లైన్ ద్వారా హాజరైయ్యారు. 

ఈ కార్యక్రమంలో ఆత్మీయ సందేశకులుగా యూనివర్సిటీ ఈసీ మెంబర్లు కొట్టి  రమేష్, సలహామండలి సభ్యులుగా డా.

తలారి వాసు, జి.ఎం.వి.రమణ, ఎం.శ్రీరామమూర్తి, బిబిసి శంకర్, సాక్షి హరేష్, యూనివర్సిటీ ఈసీ మెంబర్లు టి. అశోక్, డా. బి. జగన్మోహనరెడ్డి, ప్రిన్సిపాల్ డా.కె. రమనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam