DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆత్మహత్యకు సిద్ధపడిన కుటుంబాన్ని కాపాడిన పోలీసులు

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  27, 2020 (డిఎన్ఎస్):* కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య సిద్ధపడిన ఓ కుటుంబాన్ని పోలీసులు కాపాడగలిగారు. శనివారం ఉదయం 10.15 నీ.లకు ఏలూరు పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి  ఫోను ద్వారా దేవరపల్లి  ఎస్ ఐ  స్వామి  కి వచ్చిన సమాచారం ప్రకారం

 పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నటకు AP 37 TV 0552 నెంబర్ గల  కారులో వెళుతున్నట్టు తెలిసింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి నారాయణ్ నాయక్ ఆదేశాలపై, దేవరపల్లి ఎస్ ఐ ఉదయం పదిన్నర గంటలకు దేవరపల్లి

హైవే మొబైల్ లో పనిచేయుచున్న విజయ్ కుమార్ పి. సి. 2499 హోం గార్డ్ భాస్కరరావు సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో కారును కనిపెట్టగలిగారు. ఎస్ ఐ హైవే మొబైల్ వారితో కలిసి ఆ కారులో ప్రయాణించే వారి వివరాలను, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా కారు దేవరపల్లి నుండి బంధపురం పోవు పోలవరం కలువగట్టు వైపు వెళుతుందని

గమనించి అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు స్టేషన్  కు తీసుకువచ్చి  ఎస్ఐ గారు వారికి మానవ జీవితం యొక్క విలువలను గురించి అలాగే కుటుంబ సంబంధాల గురించి వారికి కౌన్సెలింగ్ చేసి వారి బంధువులకు అప్పగించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam