DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*భారత ఆర్థికరంగ స్వర్ణ యుగానికి మార్గదర్శి పీవీ*  

*రచ్చ గెలిచి. . . ఇంట ఓడి. కి ప్రత్యక్ష నిదర్శనం పీవీ.

*అపరచాణుక్యుడు పీవీ శత వర్ష జన్మదినోత్సవం* 

*నమ్మిన వారిని నట్టేట ముంచే కాంగ్రెస్ పార్టీ పీవీ నీ వదల్లేదు* 

*పీవీ శతవర్ష జన్మదిన సందర్బంగా DNS ప్రత్యేకం*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  28, 2020 (డిఎన్ఎస్):* స్వాతంత్య్ర  భారత ఆర్థికరంగ స్వర్ణ యుగానికి మార్గదర్శి మాజీ ప్రధాని, అపరచాణుక్యుడు, బహుభాషావేత్త, దార్శనికుడు పీవీ నర్సింహారావు. జూన్ 28, పీవీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఒక ప్రత్యేక విశ్లేషణ.   

ఇంట గెలిచి రచ్చ గెలు అనేది ఒకప్పడు

నానుడు. . . ఈ సామెత ఒకే ఒక్కరి జీవితంగా బెడిసి కొట్టింది. ప్రపంచదేశాలను సైతం తన చాణుక్య పథకాలతో కట్టడి చేసిన అపరచాణుక్యుడు, ప్రపంచ మేధావి పీవీ నర్సింహారావు విషయంలో ఈ నానుడి తప్పు అని తేలింది. 

దశాబ్దాల కాలం పాటు తానూ నమ్మిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఒడుదుడుకుల్లో ఉన్నా, తన అడుగు పార్టీ నుంచి బయట పెట్టని

బుద్దిమంతుడు. అయితే నమ్మిన వారిని నట్టేట ముంచే అలవాటు ఉన్న కాంగ్రెస్ పీవీ విషయం లోనూ అదే చేసింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తీసుకువచ్చి, ప్రధానిగా ఐదేళ్ల కాలం పాటు భారత దేశానికి స్వర్ణ యుగాన్ని పరిచయం చేసారు. 

*అపరచాణుక్యుడు, ప్రపంచం మెచ్చిన మేధావి. .

శ్రీమాన్ పాములపర్తి వెంకట నర్సింహారావు కు శత వర్ష జన్మదినోత్సవ శుభాకాంక్షలు.*

*పివి నర్శింహారావు. . . ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. ఈయన పేరు చెప్పగానే. . .విదేశాల ప్రజలు కూడా ఈయన మావాడే అనుకునేంతగా వాళ్ళ భాషలో వాళ్లతో సమానంగా ప్రసంగించగల భాషావేత్త.* 

*కాకలు తీరిన కాంగ్రెస్ పార్టీ లో వర్గ

సంప్రదాయం నడపని ఏకైక నాయకుడు పీవీ యే. అన్ని రాష్ట్రాల నాయకులూ పీవీ మావాడే అనుకునే విధంగా తన చతురతను అమలు చేసేవారు.*

*ఇందిరా కాలం నుంచి పార్టీలో చక్రం త్రిప్పుతూ . . ఆమెకు రాజకీయ, వ్యక్తిగత సలహాదారు గా ఆయన ఇచ్చిన సూచనలు ఇందిరకు స్వర్ణయుగాన్ని అందించింది.*

*ఆమె మరణం తర్వాత దేశం, కాంగ్రెస్ పార్టీ

భవిష్యత్ ఏంటి అని అంతా ఆందోళన చెందుతున్న సమయంలో రాజీవ్ ను తెరపైకి తీసుకు వచ్చి, ఆయనకు అండ, దందా గా నిలబడి ఆయనకు, పార్టీకి, దేశానికి ఒక ప్రతిష్టను అందించారు.*

రాజీవ్ అకాల మరణం తదుపరి కాలంలో దేశం పూర్తిగా సందిగ్ద పరిస్థితుల్లో భారత ప్రధానిగా భాద్యతలు చేపట్టి, ఐదేళ్ల కాలం పాటు సుస్థిర పాలనను

అందించారు. 

దేశంలో అంతర్గత కుమ్ములాటలు సైతం తన మాట మాత్రంగానే అదుపులో పెట్టి, ప్రతిపక్షాలకు సైతం నిద్రపట్టనివ్వని మహా మేధావి.

ఆర్ధిక రంగంలో భారత దేశం ప్రపంచదేశాలకు మార్గదర్శకంగా నిలిచింది అంటే. . దాని పూర్వరంగం పీవీదే.  ఈ దేశానికి ఒక ఆర్ధిక మేధావిని డాక్టర్ మన్మోహన్ సింగ్ రూపంలో అందించి,

ఆర్ధికరంగాన్ని కుదుపుల్లేకుండా సానుకూలంగా ఐదేళ్ల కాలం నడిపించి, తర్వాత కాలంలో పాలకులకు సైతం ఒక మార్గదర్శకాన్ని ఏర్పాటు చేసిన ధీశాలి.

బద్ద శత్రు దేశాలుగా భావించే పాకిస్తాన్, చైనా వంటి దేశాల్లో సైతం భారత్ పట్ల ఒక సానుకూలత ఏర్పడే విధంగా వారిని కట్టడి చేసిన అపరచాణుక్యుడు.

సుమారు 16 స్వదేశీ, విదేశీ

భాషల్లో అనర్గళంగా ప్రసంగించగల భాష వేత్త. ప్రస్తుత తరంలో, అందునా సమకాలీన సమాజంలో ఇంతటి భాష మేధావి లేనేలేరన్నది అక్షర సత్యం. 

అయితే తన జీవిత కాలం కాంగ్రెస్ పార్టీ కే సేవలు చేసి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నప్పటికీ, ప్రధాని గా పదవి కాలం ముగిసిన తదుపరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ప్రత్యక్ష

నరకం చవి చూసారు. ప్రధానంగా ఇందిర కుటుంబం నుంచి పీవీకి  ఎదురైన ఛీత్కారాలు, అవమానాలు ప్రతిపక్ష పార్టీలను సైతం కంటతడి పెట్టించాయి. ఆఖరికి అయన అంత్య క్రియలను కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేయనివ్వకుండా అడ్డుకోవడమే కాక, ఆ కార్యక్రమానికి హాజరైన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు కూడా (అనధికారికంగా) జారీచేయడం అత్యంత

దుర్భరం. ఈయన మరణించే నాటికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారం లో ఉంది. ఈయన ఎవరినైతే ఆర్ధిక మంత్రిగా ప్రపంచానికి ప్రచారం చేసారో అదే మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదవిలో ఉండడం గమనార్హం.*

*ఆఖరికి పివి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం (అక్బర్ రోడ్) లోకి తీసుకు రావడానికి కూడా అంగీకరించని

మహాధనులు నాడు పాలకులుగా ఉన్నారు* 

ఈయన హయాంలో దేశానికి చేసిన సేవలను తదుపరి కాలంలో ప్రధానిగా భాద్యతలు చేపట్టిన అటల్ బిహారి వాజపేయి కొనియాడని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. పీవీ ఈ దేశానికి చేసిన సేవల గురించి అయన మరణాంతర వాజపేయి చెప్పిన మాటలు దేశ ప్రజలను అత్యంత ఆశ్చర్యానికి గురి చేసాయి. 

ఈ స్థాయి

ప్రపంచ మేధావి, ఇప్పట్లో జన్మించే అవకాశమే లేదు అన్నది అక్షర సత్యం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam