DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక అధికారి పై వేటు వేసేందుకు ఒక విధానం పాటించరా ? : మాజీ రిజిస్ట్రార్ వెలగపూడి 

మూడున్నర ఏళ్ల సేవకు గుణపాఠం నేర్పారు :  

తొలగింపు పై చంద్రబాబు ను కలుస్తా ... 

విశాఖపట్నం, జులై 9 , 2018 (DNS Online ): తనకు మూడున్నరేళ్ల కాలం ఏ యు రిజిస్ట్రార్ గా సేవ

చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి కృతజ్ఞతా తెలియచేస్తానని ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏ యు) బహిష్కత (మాజీ) రిజిస్ట్రార్  à°¡à°¾à°•à±à°Ÿà°°à±

వెలగపూడి ఉమా మహేశ్వర రావు తెలిపారు. సోమవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో అయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఒక ఉద్యోగి పై వేటు వేసేందుకు ఒక పద్దతి

పాటించకపోవడం కేవలం ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏ యు) లోనే చోటు చేసుకోవడం అత్యంత దారుణమని అన్నారు.  
మూడున్నరేళ్ల కాలం పాటు రిజిస్ట్రార్ గా సేవలందించిన తనకు ఏ యు

పాలక మండలి మంచి గుణపాఠం నేర్పిందన్నారు. అత్యంత భయానకమైన హుద్ హుద్ తుఫాన్ తాకిడి ఏ యు అతలాకుతలం అయినప్పుడు రాత్రనక, పగలనక సిబ్బంది, విద్యార్థులతో కలిసి

యధాస్థితి కి తీసుకు రావడం జరిగిందని తెలియచేసారు. తానూ పదవి చేపట్టిన కేవలం ఆరు నెలల కాలం లోనే నేక్ (N A A C ) కమిటీ పర్యటనకు వచ్చిందని, ఏ యు కు మంచి ఉన్నత రాంక్

రావాలంటే అన్ని విభాగాలతోనూ సమన్వయము చేసి మంచి ఫలితం సాధించగలిగామన్నారు. ఎయు అభ్యున్నతికి గత మూడున్నరేళ్ల కాలం లో పూర్తి భాద్యతలను నిర్వర్తించినట్టు

తెలిపారు.     

మరో వ్యక్తికీ ఇలాంటి తొలగింపు వద్దు :...

తాత్కాలిక ఉద్యోగిని కూడా తొలగించాలంటే ఒక విధానం ఉంటుందని, అలాంటిది తనని తొలగించినట్టు తన ఒక

లేక తన ఇంటి వాచ్ మాన్ కి ఇవ్వడం ఏ యు చరిత్రలోనే దురదృష్టకరమన్నారు. ఏ యు లో ఉప కులపతి తర్వాత అంటే హోదా, విలువ కల్గిన స్థానం రిజిస్ట్రార్ అని, అలాంటి పదవి లో ఉన్న

వ్యక్తిని తొలగించడం పాలకమండలి నిర్ణయిస్తుందని, అయితే  à°¤à±Šà°²à°—ించేముందు చెప్పి ఉంటె హుందాగా ఉండేదన్నారు. ఏ పద్దతి పాటించకుండా, ఏ తప్పు చూపించకుండా

అర్ధరాత్రి ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా పదవి నుంచి తొలగించడం అవమానకరమేనన్నారు. ఇది ఏ ఒక్కరి కో కాదు, అది విద్యాలయం ప్రతిష్టకు సంబంధించినది

అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam