DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైశ్య సేవ సదనం దేవాదాయ ధర్మాదాయ పరిధిలోకి రాదు

*జీవో నెంబర్ 10 98 /2008 ప్రకారం పూర్తిగా ప్రైవేట్ సంస్థ*

*సదనానికి సంస్థ సభ్యులే పరిపాలకులు* 

*రాజమండ్రి వైకాపా కన్వీనర్ శివరామ సుబ్రహ్మణ్యం వెల్లడి.*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూలై 01, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని వైశ్య సేవాసదన్

పూర్తిగా సంస్థ కార్యవర్గ సభ్యులు కే నడపబడుతుంది అని ఇది పూర్తిగా ప్రైవేట్ సంస్థని ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి రాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం కన్వీనర్ శ్రీకాకుళ పు శివరామ సుబ్రహ్మణ్యం విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు ఈ  సదనం 1920లో కీర్తిశేషులు నాళం రామలింగయ్య  స్థాపించారు.

1937లో సొసైటీ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కింద 1860 ద్వారా రిజిస్టర్ అయి ఉందని ఆయన చెప్పారు దాత ఆశయం ప్రకారం ఇది పూర్తిగా మహిళలు అభ్యున్నతికి వారి బ్రతుకు తెరువుకు సమాజంలో వారికి గుర్తింపు కలిగేటట్టు మంచి భవిష్యత్తు కలగ  చేయడానికి తెలుగు, హిందీ ,ఇంగ్లీష్, తదితర భాషలను సాంకేతిక విద్య లలిత కళలు వైద్య పారిశ్రామిక కార్మిక

సాంకేతిక విద్యలను ప్రోత్సహించే విధంగా సంస్థ స్త్రీలకు ఉచితంగా వారికి  ప్రోత్సాహము కల్పించవలసి ఉంది అది దాత నాళం రామలింగయ్య ఉద్దేశం. అయితే ఈ సంస్థ నడపడానికి ఆర్థిక బలాన్ని కూడా ఆయన చేకూర్చారన్నారు.  తనకున్న ఆస్తులను ఈ   సదనానికి అంకితం చేశారు తూర్పుగోదావరి జిల్లాలోనూ విజయనగరం జిల్లాలోనూ మొత్తం 565 ఎకరాల 18

సెots భూమి అన్నట్టు శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం చెప్పారు  గత వంద సంవత్సరాల నుండి ఈ సంస్థ యధావిధిగా స్త్రీలకు చేయూతనిస్తూ ముందుకు సాగుతోంది అయితే ఇటీవల ఈ సంస్థ దేవాదాయ ధర్మాదాయ పరిధిలోకి వస్తుందని ఆ శాఖ ఆదేశాలు జారీ చేయడం వెనక సంఘ సభ్యులలో ఒకరు దురుద్దేశ పూర్వకంగా స్వార్ధ పరమైన ఆలోచనలతో వ్యవహరించారని అంతే తప్ప ఈ

వైశ్య సేవాసదన్ ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు రాదని ఆయన స్పష్టం చేశారు జీవో ఎంఎస్ నెంబర్  10 98 / 2008 , అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ సంస్థ పూర్తిగా ప్రైవేట్ సంస్థ కిందే వర్తిస్తుందని ఆయన చెప్పారు ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సంస్థ కు సంబంధించిన 32 ఎకరాల 24 సెంట్ల భూమిని

గృహ అవసరాల నిమిత్తం ప్రభుత్వానికి ఇవ్వడానికి సభ్యుల అంగీకారంతో ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని అందుకు ప్రభుత్వం నుండి 14 కోట్ల 50 లక్షల 80000 రూపాయలను వైశ్య సేవ సగం సదనం పేరున ఫిక్సెడ్ డిపాజిట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు అయితే ఈ మొత్తానికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ జాయింట్ అకౌంట్ వేయాలని ఉత్తర్వులను

జారీ చేసింది ఈ సంస్థ పూర్తిగా ప్రైవేటు సంస్థ గనుక ఆ శాఖ ఆదేశాలను అమలు చేయలేదు దేవాదాయ ధర్మాదాయ శాఖ 43 రిజిస్టర్ లో సభలో ఆస్తులను పొందుపరచడం జరిగిందని అందుకు ఈ ఆస్తులు దేవాదాయ ధర్మాదాయ పరిధిలోకే వస్తాయి ఆ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ విషయమై 43 రిజిస్టర్ గురించి  తెలియదని, దీనికి సంబంధించి సంఘ సభ్యులు

ఒకరు  తెలియకుండా ఉద్దేశ పూర్వకంగా, దురుద్దేశం తో, దేవాదాయ ధర్మాదాయ  శాఖ వారితో చెప్పి ఈ విధంగా చేయించినట్టు  తెలిసిందని ఆయన చెప్పారు భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులను మాటలను నమ్మేది లేదని ఇటువంటి వారిని రానిచ్ఛేది లేదని అయన చెప్పారు.  పూర్తిగా సభ్యుల పరిపాలనలోనే ఈ వైశ్య సేవాసదన్ దాత అభిప్రాయాల మేరకు

ఆయన ఉద్దేశాలు మేరకు పూర్తిగా మహిళలకు వారి అభ్యున్నతికి చేయూతనిచ్చి వారి భవిష్యత్తును బంగారు బాట వేయాలన్నది సభ్యుల ఉద్దేశమని ఆ విధంగా  అభివృద్ధి చేసి మహిళల జీవితాలను ఆనందమయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు
ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శితో పాటు సభ్యులు ఇతర వైశ్య పెద్దలు మహిళలు సదనం విద్యార్థులు ఉపాధ్యాయులు

కూడా పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam