DNS Media | Latest News, Breaking News And Update In Telugu

104 ,108 అంబులెన్సుల ప్రారంభం, రాష్ట్రంలో సువర్ణాధ్యాయం

*1088 వాహనాలు ఒకేసారి ప్రారంభం, ప్రజారోగ్యానికి  పెద్దపీట*

*రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 02, 2020 (డిఎన్ఎస్):*  రాష్ట్రవ్యాప్తంగా 104, 108, అధునాతన అంబులెన్సులను ఒకేసారి ప్రారంభించుకోవడం రాష్ట్రచరిత్రలో

సువర్ణధ్యాయమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 
శ్రీకాకుళం లోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 104, 108, అధునాతన అంబులెన్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామాత్యులు

ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ జె.నివాస్ తో కలిసి వాహనాలను పరిశీలించిన మంత్రి వాహనాలకు పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇది ఒక సరికొత్త అధ్యాయమని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసారని, అందులో భాగంగా

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 1088 వాహనాలు  104, 108 , అధునాతన అంబులెన్సులను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో ప్రారంభించిన సంగతిని మంత్రి గుర్తుచేసారు. అలాగే జిల్లాలో పెద్దఎత్తున ఒకేసారి 44 వాహనాలను ( 104,108, అదునాతన అంబులెన్సులు ) ప్రారంభించుకోవడం జరిగిందని  తెలిపారు.ఇందులో               108 వాహనాలు  22,104 వాహనాలు 14,

అధునాతన సౌకర్యాలు కలిగిన అంబులెన్సులు         8 ఉన్నాయన్నారు. ఇది రాష్ట్రచరిత్రలోని వైద్యరంగంలో ఒక సువర్ణఅక్షరంతో లిఖించవలసిన రోజు అని కొనియాడారు. నాడు దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ, 104,108 వాహనాలను ప్రారంభించడం జరిగిందన్నారు. నేడు మన

ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేసి ప్రజారోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తూ, ఆరోగ్యానికి పెద్దపీట వేసారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైద్యరంగంలో ప్రత్యేక చొరవ కనబరుస్తూ, నాడు-నేడు క్రింద ఆసుపత్రులను పునర్ణిర్మాణం, కొత్త ఆసుపత్రుల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో కొత్తగా వైద్యకళాశాలలు

స్థాపన, సంపూర్ణ వసతులతో ఆసుపత్రుల నిర్మాణాల వంటి పలు సేవలకు అనుమతులను ఇస్తున్నట్లు మంత్రి వివరించారు.
    వైద్య రంగాన్ని ఆదుకుంటూనే వైద్య సిబ్బందికి జీతాలు పెంచాలనే ఆలోచనతో ఆశావర్కర్లకు అబ్బురపరచేవిధంగా జీతాలు పెంచిన సంగతిని మంత్రి గుర్తుచేసారు. పేదలకు సహాయం చేసే వైద్యులను గౌరవించాల్సిన బాధ్యత మనపై

ఉందని, వారు బాధ్యతాయుతంగా పనిచేయాలంటే సరైన జీతాలు ఇవ్వాలనే ముందుచూపుతో ముఖ్యమంత్రి ఆలోచన చేసారని కొనియాడారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ప్రధానం కాదని, ఆరోగ్యరంగానికి పెద్దఎత్తున కేటాయింపులు చేసి ఎన్నెన్నో విప్లవాత్మక మార్పులు సిఎం తీసుకువచ్చారని కితాబిచ్చారు. ప్రజారోగ్యం కోసం పెద్దఎత్తున చేపట్టిన ఈ

కార్యక్రమానికి దేశం యావత్తు ప్రసంశలు కురిపించిందని మంత్రి తెలిపారు.
జిల్లాలో కరోనా నియంత్రణ కోసం యంత్రాంగం అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుండి వస్తున్న వారి వలన మన జిల్లాకు కూడా కరోనా వచ్చిందని, అత్యంత జాగురకతతో వైద్యులు దాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.                  

 రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపై ప్రతీ రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో దీన్ని కట్టడి చేసేందుకు అన్ని విధాల కృషిచేస్తున్నట్లు చెప్పారు. వైద్యరంగానికి అవసరమైన ప్రజారోగ్యం కోసం తీసుకోవలసిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని, వైద్యరంగానికి ఎక్కడా ఏదీ కొరతలేకుండా అన్ని వసతులను సమకూర్చడం

జరుగుతుందని మంత్రి స్పష్టం చేసారు. గత ప్రభుత్వంలో 104, 108 సిబ్బందికి జీతాలు లేక అవస్ధలు పడేవారని, కాని ప్రస్తుత ప్రభుత్వం 104,108 వాహనాల సిబ్బంది జీతాలను కూడా పెద్ద ఎత్తున పెంచిందని చెప్పారు. వాహన డ్రైవరుకు రూ.10వేల నుండి రూ.28 వేలకు, టెక్నీషియన్స్ కు రూ.12 వేల నుండి రూ.30వేలకు పెంచిందని మంత్రి తెలిపారు.  ప్రజలకు మరిన్ని సేవలు

అందించేందుకు మనోధైర్యాన్ని కల్పించే దిశగా జీతాలు పెంపు జరిగిందనే విషయాన్ని వాహన సిబ్బంది గుర్తెరగాలని చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల్ని పూర్తిగా సమర్ధించి జాగురకతతో జిల్లా ప్రజలకు అన్ని రకాల సేవలు సాయశక్తుల అందించాలని వైద్యులు, టెక్నిషియన్లు, డ్రైవర్లను మంత్రి కోరారు. ప్రభుత్వం అంటే కేవలం కొద్దిమంది

పాలకులో, ఉద్యోగులో కాదని, చిత్తశుద్ధితో అందరం కలిసి పనిచేసిననాడే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని, ఆ దిశగా ప్రతీ ఒక్కరూ సహకరించి, కష్టపడి పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే విపక్షాలు దీనిపై కూడా విమర్శలు చేస్తున్నాయని, సద్విమర్శలు చేస్తే వాటిని తప్పక స్వీకరిస్తామని మంత్రి

వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నీతి నియమాలతో కూడిన పరిపాలనను అందించేందుకు కంకణం కట్టుకున్నారని,  ఎటువంటి విమర్శలకు తావులేకుండా  రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చేపట్టిన సచివాలయ ఉద్యోగ నియామకాలే ఇందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు. 
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ దేశ చరిత్రలో నిలిచిపోయేరోజు

ఇదని కొనియాడారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడుతుందని, ఇటువంటి సమయంలో అధునాతన వాహనాలు జిల్లాకు రావడం హర్షదాయకమన్నారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి  ముందుచూపు, కఠోరదీక్షే ప్రధానమని కలెక్టర్ తెలిపారు. ఏ కార్యక్రమానికి అయినా మెన్, మనీ, మెటీరీయల్ అనేది అవసరమని, మన ముఖ్యమంత్రి ప్రజల కోసం              ఆ దిశగా

ముందుకు వెళ్తున్నారని, అందులో భాగంగానే రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున వాహనాలను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. గతంలో జిల్లాలోని అంబులెన్సులకు వెంటిలేటర్ సదుపాయాలు కూడా లేవని, కాని ప్రస్తుతం అధునాతన సౌకర్యాలతో , వెంటిలేటర్ సదుపాయం కలిగిన 8 వాహనాలు జిల్లాకు వచ్చాయని చెప్పారు. కరోనా టెస్టులు, ఇతరత్రా  కోసం

రోజుకు సుమారు రూ.2 కోట్లు ఖర్చువుతున్నప్పటికీ, జిల్లాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెసులుబాటు ఇచ్చారని, ఆ వెసులుబాటుతోనే ఇప్పటివరకు జిల్లాలో 90వేల కరోనా టెస్టులను అవసరమైన వారికి చేయగలిగామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కోసం చేపడుతున్న చర్యలు దేశంలోనే మార్గదర్శకంగా ఉన్నాయని అన్నారు. గతంలో ఆశావర్కర్లు సరైన జీతాలు లేక

అవస్థలు పడేవారని, వారికి రూ.3వేల నుండి రూ.10వేలకు జీతాలు పెంపుదల చేసారని చెప్పారు. అలాగే 104, 108 సిబ్బంది గతంలో జీతాలు అందక సమ్మెలు చేసేవారని, వారికి కూడా ఊహించని రీతిలో జీతాలను పెంచిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. ప్రభుత్వం ఇన్ని వసతులు కల్పించిన సిబ్బంది జిల్లాలోని ప్రతీ ప్రాంతంలోని రోగులకు సరైన సమయంలో వైద్యాన్ని

అందించి వారికి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే 104 వాహనంలోని పరికరాలను సక్రమంగా వినియోగించుకోవాలని, జిల్లాలోని రోగులకు మంచి సేవలు అందిస్తూ రాష్ట్రానికి పేరుతెచ్చి దేశంలో ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు డా. సీదిరి అప్పలరాజు, జిల్లా వైద్య ఆరోగ్య

శాఖాధికారి డా. యం. చెంచయ్య, కరోనా నియంత్రణ ప్రత్యేక అధికారి                               డా. బి.జగన్నాథరావు, జిల్లా పర్యాటక అధికారి యన్.నారాయణరావు, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాసరావు, మేనేజర్ ఆర్.వి.ప్రసాదరావు, ఇతర అధికారులు, వాహన సిబ్బంది

తదితరులు పాల్గొన్నారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam