DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నడిగడ్డపాలెం లో చిన్న జీయర్ స్వామి చాతుర్మాస్య దీక్ష నిర్వహణ

*సమాజ శ్రేయస్సు కోసమే చాతుర్మాస్య దీక్ష* 

*సన్యాసులు కాదు. . సామాన్యులు కూడా చేయవచ్చు.*

*గ్రామాంతరం చెయ్యరాదు, ఒంటిపూట ఆహారం. .*

*గతం లో 4 నెలలు చేసేవారు, నేడు రెండు నెలలకే. . .*

*ముఖానికి మాస్క్ లేకుంటే. . ఆశ్రమంలో ప్రవేశం ఉండదు . .*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 04, 2020 (డిఎన్ఎస్):* ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు త్రిదండి చిన్న జీయర్ స్వామి, వారి శిష్యులు త్రిదండి అహోబిల జీయర్ స్వామి వార్లు ఈ ఏడాది చాతుర్మాస్య దీక్షను గుంటూరు జిల్లా లోని నడిగడ్డపాలెం లో గల తమ ఆచార్యుల ఆశ్రమమైన వాసుదాసాశ్రమం లో నిర్వహిస్తున్నారు. ఈ

నెల 5 వ తేదీ ఆషాఢ పౌర్ణమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఈ దీక్ష ఆరంభం కానుంది. 
 
ఈ దీక్ష సమయంలో గ్రంథ పఠనం, ఉపనిషత్ వివరణ తదితర వైదిక గ్రంథ కాలక్షేపటం తో పాటు భక్తులకు మంత్రోపదేశం కూడా చేసే అవకాశం ఉంటుంది. తమ వికాస తరంగిణి ద్వారా సమాజ సేవతో పాటు, మహిళలకు కాన్సర్ పట్ల అవగాహనా కల్పించేందుకు ఆరోగ్య

వికాస్, పశు వైద్య శిబిరాలు, నిత్యా అన్న ప్రసాద వితరణ చేపట్టనున్నారు. ప్రతి కార్యక్రమం ప్రభుత్వం నిబంధనల ప్రకారం కనీస దూరం పాటిస్తూ,  ముఖానికి మాస్క్ లేని వారికీ ఆశ్రమ ప్రవేశం ఉండదని ఇప్పడికే తెలియచేయడం జరిగింది. 

చాతుర్మాస్యం ప్రాశస్త్యం :. . .

సన్యాసాశ్రమం లో జీవించే వారు తమ తప: శక్తిని

పెంపొందించుకునేందుకు ఏడాది లో నాలుగు నెలల కాలం పాటు ఒకే ప్రాంతం లో నివాసం ఉంది, గ్రంథ పఠనం, జప తపాదులు ఆచరించడం జరుగుతుంది. దీనికి అనువైన కాలంగా వర్షాకాలం లో నిర్ధారణ చెయ్యడం జరిగింది. ఆషాఢ పౌర్ణమి నుంచి, కార్తీక పౌర్ణమి వరకూ అత్యంత ఉపయుక్తకరమైన కాలంగా ఋషులు ఏనాడో తెలియచేసారు. కాలాంతరం లో నాలుగు రోజులు ముందుగా ఆషాఢ

శుద్ధ ఏకాదశి ( తొలిఏకాదశి) అత్యంత పవిత్రమైనది కావడం తో ఆ రోజు నుంచి కూడా చాతుర్మాస్య దీక్షను ఆచరించడం జరుగుతోంది. అయితే సంప్రదాయ విధానాన్ని పాటించేవారు మాత్రం పౌర్ణమి నుంచే ఆరంభించడం జరుగుతుంది. గత కొంతకాలం వరకూ నాలుగు నెలల కాలం పూర్తిగా ఈ దీక్షను చేపట్టేవారు. అయితే ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో హైందవ ధర్మ ప్రచార

కార్యక్రమాలను చేపడుతుండడంతో రెండు నెలల కాలానికే పరిమితం చేసి, తదుపరి రెండు నెలలలోనూ వైదిక కార్యక్రమాలను చేపడుతున్నారు. 

ఈ కాలమే ఎందుకు ? . . .

యతులు, జీయర్లు, పీఠాధిపతులు, సాధువులు, సన్యాసులు సాధారణంగా దేశ వ్యాప్తంగా సంచరిస్తూ హైందవ సంప్రదాయ విషయాలను ప్రచారం చేస్తుంటారు. అయితే వర్షాకాలం లో ఈ

పర్యటనలను కొనసాగిస్తే వాతావరణం అనుకూలంగా ఉండక, రహదారులు అస్తవ్యస్తంగా ఉండి,  వీళ్ళు నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది. దీనివలన ఈ నాలుగు నెలల వర్షాకాలం లో దీక్ష ను చేపట్టి ఒకే ప్రాంతం లో ఉండి తమ ఆధ్యాత్మిక విజ్ఞాన పరిజ్ఞానాన్ని పెంచుకునే విధంగా మహర్షులు ఈ విధానాన్ని తెలియచేసారు. 
ఈ నాలుగు నెలల కాలంలో గతం లో తాము

నేర్చుకొని వేద విద్యను అభ్యసించడంతో పాటు అధిక కాలం జపం, తాపం లోనే గడపవలసి ఉంటుంది. గో సేవ, వేదపఠనం, ఉపనిషత్, ప్రబంధ పఠనం నిత్యం జరుగుతూనే ఉండాలి. తాము అభ్యసించిన అంశాలను ఆశ్రమవాసులకు వివరించడం జరుగుతుంది. 

కఠోర ఆహార నియమాలు : . . .

ఈ దీక్షలో నాలుగు నెలల పాటు ఆచరించవలసిన ఆహార నియమాలను కూడా మహర్షులు

తెలియచేసారు. రోజు కు ఒక పూటే ఆహారం తీసుకోవాల్సి యుంటుంది. రాత్రి వేళల్లో కేవలం క్షీరం మాత్రమే తీసుకోవాల్సి యుంటుంది.  

చాతుర్మాస్య వ్రతం ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ మొదటి నెలలో కూరలు, రెండవ నెలలో పెరుగు, మూడవ

నెలలో పాలు, నాల్గవ మాసం లో పప్పు దినుసులూ తినకూడదు. భాగవతం వంటి గాథలు వింటూ ఆథ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి. వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతం ఆచరిస్తారు.

ప్రయాణాలు నిషేధం : . . .

ఈ కాలంలో యతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు.

చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధచాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ, పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు,

యోగినులు మొదలైనవారెవరైనా చేయవచ్చును. ఇది హిందువులతో పాటు జైన, బౌద్ధ మతస్థులు ఉండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గానీ, వీలుకాకపోతే కటక సంక్రాంతి, కాకపొతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు.

ఎవరైనా పాటించవచ్చు. : . ,

ఈ చాతుర్మాస్యాన్ని అన్ని

ఆశ్రమాలోని  బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస వారు పాటించవచ్చు.  కుల, వర్గ, లింగ భేదాలు లేకుండా అందరూ తమ దైవ శక్తిని పెంచుకునే విధంగా ఆచరించవచ్చు. 

ప్రధాన నియమాలు ఇవే : . . .

ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు.

ఈ కాలంలో బ్రహ్మ ముహూర్తం లోనే స్నానాదులు

ముగించాలి.

బ్రహ్మచర్యం, ఒంటిపూట ఆహారం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి.

ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షర లక్షలుగా జపించాలి.

ఉపనిషత్తు లు, ప్రబంధాలను అధ్యయనం చెయ్యాలి. .

వైదిక సంప్రదాయ గ్రంధాలను క్షుణ్ణంగా పరిశీలనా చేయాలి.

యోగసాధన చేయడం

శ్రేయస్కరం.

దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.

లోక కల్యాణార్థం వైదిక కార్యక్రమాలను చేపట్టాలి. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam