DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కర్ణాటక లో టిటిడి సత్రాలు, కర్ణాటక ప్రభుత్వం తో ఒప్పందం

*టిటిడి బోర్డు సమావేశాలు ఎస్ వి బి సి లో లైవ్ లోనే : చైర్మన్ వైవి* 

17 మంది టిటిడి సిబ్బంది కి పాజిటివ్, భక్తులు సురక్షితం. . . 

ఆన్ లైన్ లోనే టిటిడి పాలక మండలి సమావేశం.

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి / తిరుమల, జూలై 04, 2020 (డిఎన్ఎస్):*  రానున్న టిటిడి పాలక మండలి

సమావేశాలు లైవ్ టెలికాస్ట్ చేస్తాం:  టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు సమావేశం తిరుమలలో శనివారం జరిగింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్ జరిగిన ఈ సమావేశం లో ఐదుగురు సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా హాజరు

కాలేని సభ్యులు విడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన పాలకమండలి సమావేశం అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంటు లైవ్ సమావేశాలు మాదిరిగానే టీటీడీ పాలక మండలి సమావేశం కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వీటిని ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా లైవ్ టెలికాస్ట్

ఇవ్వడానికి టిటిడి అధికారులు నిర్ణయం.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు తిరుమలలోని  కర్ణాటక సత్రాల కళ్యాణమండపానికి అనుమతి ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం టిటిడికి 200 కోట్లు డిపాజిట్ చేసిందన్నారు. 
త్వరలో కర్ణాటక సత్రాలలో  కర్ణాటక సీయం, ఏపి సీయం కలిసి శంకుస్థాపన చేస్తారన్నారు.

కరోన నేపథ్యంలో టిటిడి ఉద్యోగస్తుల భద్రత పై పాలకమండలి లో చర్చ జరిగిందన్నారు.  శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ లో టిటిడి ఉద్యోగులకు కోవిడ్ కొరంటైన్ ఏర్పాటు. టిటిడి ఉద్యోగులకు ప్రత్యేక కోవిడ్19 కి వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. 

17 మంది టిటిడి సిబ్బంది కి పాజిటివ్. . . 
 
గత నెల జూన్ 8 నుంచి శ్రీవారి

దర్శనంకి భక్తుల అనుమతించామని, గత 25 రోజుల్లో మొత్తం 17 మంది టిటిడి సిబ్బంది కి పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే ఏ ఒక్క భక్తుడికి కూడా కరోనా అనుమానిత లక్షణాలు రాలేదని తెలిపారు. 

గత వారం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగు తుండడంతో శ్రీవారి దర్శనం కి వచ్చే భక్తుల సంఖ్య పెంచాలా, వద్ద అనే అంశం పై సభ్యుల సూచనలు

స్వీకరించాం.

పాలకమండలి సభ్యుల సూచన మేరకు కరోనా  విజృంభిస్తుండడంతో ఇప్పుడున్న పరిస్థితులలో భక్తుల సంఖ్య ను పెంచబోమని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

కరోనా వైరస్ సోకిన టిటిడి ఉద్యోగులు వైద్య ఖర్చులన్ని టిటిడి నే భరించాలని నిర్ణయించాం. ఉద్యోగులకు టిటిడి అండగా ఉంటుందని చైర్మన్

వైవి.సుబ్బారెడ్డి చెప్పారు.

తిరుమల లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరుమలకి అనుమతిస్తాం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీవారి ఆర్జిత సేవలను ప్రారంభించలేం.

కల్యాణోత్సవం సేవను అన్ లైన్ లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం...ఎప్పటినుంచి అమలు చేయాలనే

దాని పై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాo.

గత 15 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న కర్ణాటక సత్రాల లో సమస్యని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో చర్చించాం

7.5 ఎకరాల కర్ణాటక ప్రభుత్వ భూమి లో 200 కోట్లతో అద్దె గదులు, కళ్యాణమండపం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తాం.

తిరుమల ప్రవైట్ గెస్ట్ హౌస్ కేటాయింపులో

పారదర్శకంగా బిడ్డింగ్ నిర్వహిస్తాం. అధిక డోనేషన్ ఇచ్చే దాతలకి తగిన ప్రాధాన్యత ఇస్తాం

ఆయా రాష్ట్రాల అనుమతి ఉన్న ప్రాంతాల్లోని భక్తులు మాత్రమే స్వామివారి దర్శనానికి రావాలని భక్తులను కోరుతున్నాం.

భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, మస్కులను దరిస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam