DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆన్లైన్ క్లాసులు నిర్వహించ కూడదు: మంత్రి ఆదిమూలపు

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూలై 04, 2020 (డిఎన్ఎస్):* కరోనా నేపథ్యంలో ఇంకా విద్యా సంవత్సరాన్ని ఖరారు చేయలేదని రాష్ట్ర విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని.. అలా నిర్వహించడానికి వీల్లేదని అన్నారు.

ఆన్ లైన్ ద్వారా వినడం ద్వారా విద్యార్థులకు కళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయన్నారు. అలాగే కొన్ని స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం చెప్పే వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam