DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 6 న లాయర్ల ధర్నా

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,  జూలై 05, 2020 (డిఎన్ఎస్):  భారత న్యాయవాదుల సంఘం (IAL) రాష్ట్ర కార్యవర్గ సమావేశం వెబినార్ లో జరిగిందని, రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు  తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరియు జీవోలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా

నిరసన ఆందోళన కార్యక్రమాలు ఈ నెల 6 న నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. 

తీర్మానాలు:
1. ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరియు జీవోలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ హైకోర్టు లో భారత న్యాయవాదుల సంఘం తరఫున పిటిషన్ దాఖలు చేసి న్యాయపోరాటం చేయాలని తీర్మానించడం జరిగినది.
2. కోవిడ్ లాక్ డౌన్

సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం ఇచ్చినట్లుగా పత్యేకించి 25 కోట్లు రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మంజూరు చేసి తీవ్ర ఇబ్బందులు గురవుతున్న రాష్ట్రము లోని న్యాయవాదు లందరినీఆదుకోవాలి.
3. న్యాయవాదుల సంక్షేమానికి గత సంవత్సరం బడ్జెట్ లో కేటాయించిన  వంద కోట్ల రూపాయలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి బార్

కౌన్సిల్ కి ఎటువంటి జాప్యం లేకుండా అందజేసి న్యాయవాదులు ఆదుకోవాలి.
4.. న్యాయవాదుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు బార్ కౌన్సిల్ ఇచ్చే నాలుగు లక్షల రూపాయల డెత్ బెనిఫిట్ పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ది 20-01-2019 న ఇచ్చిన జిఓ ఎంఎస్ నెంబర్ 4 ద్వారా న్యాయవాదుల మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు ఇస్తామన్నా నాలుగు లక్షల రూపాయల

మ్యాచింగ్ గ్రాంట్  తక్షణమే అమలు చేయడానికి పూనుకొని నిధులు విడుదల చేయాలి. 
5. గత నాలుగు నెలల నుంచి జూనియర్ న్యాయవాదులకు ఇవ్వవలసిన మ్యాచింగ్ గ్రాంట్ ను తక్షణమే నిధులు విడుదల చేసి ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా ఆర్ధిక  ఇబ్బందులుకు  గురవుతున్న జూనియర్ న్యాయవాదుల బకాయిలు చెల్లించి వారిని ఆదుకోవాలి. 
6. బార్

కౌన్సిల్ లో నమోదైన వెంటనే జూనియర్ న్యాయవాదులు స్టైఫండ్ కొరకు నిత్యం( ఎప్పుడయినా) దరఖాస్తు చేసుకునే విధంగా గా మార్పులు తీసుకురావాలి లేకుంటే జూనియర్ న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా అనేక నెలల స్టైఫండ్ ను కూడా నష్టపోవడం  జరుగుతుంది. 
7. న్యాయవాదుల అందరికీ హెల్త్ కార్డులు తక్షణమే రాష్ట్ర

ప్రభుత్వం ఇవ్వాలి 
8. న్యాయవాదులు అందరికీ ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam