DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ చర్యలపై పోలీసులకు అవగాహన

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 06, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె ఎన్ నారాయణ్ యొక్క ఆదేశాలపై పశ్చిమ గోదావరి జిల్లా క్వాలిటీ అసిస్టెంట్ ఫర్ హెల్త్  నోడల్ ఆఫీసర్  మనోజ్, పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్  యూనిట్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ జి. దీప గారితో   సోమవారం సాయంత్రం

జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నుండీ జిల్లాలోని పోలీసు అధికారులు మరియు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ను డాక్టర్ లు నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ నుండీ హోంగార్డుల వరకు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను లను  గురించి

సూచనల, సలహా డాక్టర్ మనోజ్ కుమార్ మరియు దీప లతో కలిసి  అధికారులందరికీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  ఉండేందుకు ఈ క్రింది విధముగా తెలియజేసినారు
* ప్రజల ఆరోగ్య భద్రతలో భాగంగా కరోనా కట్టడి పోరాటంలో శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది వారి కుటుంబాల సంక్షేమం, శ్రేయస్సు చాలా ముఖ్యం అని
* పోలీసులకు యూనిఫాం ఎంత

ప్రాధాన్యతో, కరోనా వేళ స్వీయజాగ్రత్తలు పాటించడం అంత ముఖ్యం అని,
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ ఉత్తర్వులపై ప్రతి పోలీస్స్టేషన్లలో దశ సూత్రములు అమలుపరచాలని.
* ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు, ఫేస్ షీల్డులు ధరించడం... శ్యానిటైజర్లు వినియోగించడం... సామాజిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనీ,

పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ జాగ్రత్తలు చేపట్టాలనీ,
* రెడ్ జోన్ ప్రాంతాలలో పని చేసే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, ఫేస్ షీల్డులు, శ్యానిటైజర్లతో పాటు తప్పనిసరిగా గ్లవుజులు వినియోగించాలి.
* తోటి సిబ్బందితో కలసి పని చేసేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి.
* మధ్యపానం, దూమపానం

అలవాట్లు ఉన్న వారు కరోనాతో మరింత ఇబ్బంది పడే అవకాశముంటుంది. ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలి.
* మీ అజాగ్రత్త వల్ల మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశముంది. కుటుంబంలో వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక జబ్బులున్న వారుంటే మరింత ఇబ్బందికి గురికావాల్సి ఉంటుందనీ గుర్తించి స్వీయజాగ్రత్తలుతో కుటుంబం సురక్షితంగా ఉండేలా

మసలుకోవాలనీ,
* వ్యాధి నిరోధక శక్తి పెంపొందేలా దినచర్యలుండాలి. యోగా, ధ్యానం, తాజా కాయకూరలు మరియు ఆకుకూరలు తీసుకోవడం మంచిది. పోషక విలువలుండే ఆహారం తీసుకోవడం, వేడి నీళ్లు తరుచూ సేవించడం చేయాలి.
* ప్రతీ  స్టేషన్ హౌస్ ఆఫీసర్ రోజూ ఒక గంట పాటు సిబ్బంది ఆరోగ్యం కోసం కేటాయించాలి.
* వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పోలీసు

స్టేషన్ / కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
* మలేరియా, టైఫాయిడ్ , తదితర సీజనల్ /వైరల్ జ్వరాలు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఎవవరికైనా జ్వరం, నీరసం, దగ్గు, జలుబు, తదితర లక్షణాలు ఉంటే వెంటనే ఎస్సై, సి.ఐ ల దృష్టికి తీసుకురావాలి. తక్షణమే వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం.
* వాహనాల తనిఖీ సమయాల్లో సిబ్బంది అత్యంత

జాగ్రత్తగా వ్యవహరించాల నీ తెలియచేసినరు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో పశ్చిమగోదావరి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి  కరీముల్లా షరీఫ్, ఏఆర్ అదనపు ఎస్పి ఎం మహేష్ కుమార్, ఎస్.బి.డి.ఎస్.పి. కె. శ్రీనివాసాచారి, ఏలూరు డి ఎస్ పి డాక్టర్ ఓ.దిలీప్ కిరణ్, కొవ్వూరు డి ఎస్ పి, కే రాజేశ్వర్ రెడ్డి, జంగారెడ్డిగూడెం డిఎస్పి ఎం

స్నేహిత, పోలవరం డిఎస్పి ఎం వెంకటేశ్వరరావు, నరసాపురం డిఎస్పి కె. నాగేశ్వరరావు మరియు జిల్లా లో ఉన్న ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది యావన్మంది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam