DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ప్రసాద్ సస్పెండ్

*పాలిమర్స్ ఘటనలో ఇద్దరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులపై వేటు* 

*ఎల్ జి పాలిమర్స్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్*  

*ప్రజా నష్టం పై ఏపీ  ప్రభుత్వం సీరియస్, మరింత మంది పై వేటు ?*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 07, 2020 (డిఎన్ఎస్):* ఈ ఏడాది

మే 7 న విశాఖపట్నం శివారు ప్రాంతమైన ఆర్ ఆర్ వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో ఏర్పడిన స్టైరిన్ ఆవిరి లీక్  ప్రమాదం కారణానికి బాధ్యతారాహిత్యం కారణంగా విశాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె బి ఎస్ ప్రసాద్ తో పాటు విశాఖ కాలుష్య నియంత్రణ మండలి ( పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) ఇంజినీర్లు పి ప్రసాద రావు,

ఆర్ లక్ష్మీనారాయణలను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంగళవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సంస్థ కు సంబంధించి ఇప్పడికే 12 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.  

ఈ ఘటన లో మరణించిన వారికి ఒక్కక్కరికీ కోటి

రూపాయల పరిహారాన్ని అందించింది. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. హై పవర్ కమిటీ నివేదిక వచ్చిన 24 గంటల్లోనే ఇద్దరు అధికారుల సస్పెన్షన్ చేయడం గమనార్హం. 

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో మొదటి సారి ప్రక్షాళన జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా జీవనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో

మొట్టమొదటి సారిగా కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పై చర్యలు తీసుకుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam