DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాన్ని టెక్స్ టైల్ హబ్ గా తయారు చేస్తాం:మంత్రి మేకపాటి

*ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ క్లూజివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ వెబినార్*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 10, 2020 (డిఎన్ఎస్):* *రాష్ట్రాన్ని టెక్స్ టైల్ హబ్ గా తయారు చేస్తామని, ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. శుక్రవారం జరిగిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్

క్లూజివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ వెబినార్ లో అయన కీలక ప్రసంగం చేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్నంలోని బ్రాండిక్స్ కు పునాది వేసి, సుమారు 30వేల కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పించడం గర్వించదగ్గ విషయం. అక్కడ మహిళా సాధికారతకు పెద్దపీట

వేసేలా ఎక్కువ శాతం మహిళామణులే కుటుంబాలను ముందుండి నడిపిస్తుండడం మరో చెప్పుకోదగ్గ విషయం.

* వస్త్ర తయారీ పరిశ్రమలకు నెలవైన ఏపీలో  'టోరె' సహా ఎన్నో పరిశ్రమలు  సాక్షాలుగా నిలిచాయి.

* కరోనా విజృంభిస్తూ.. ఆర్థిక ఇబ్బందులున్న సమయంలోనూ సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి ఇప్పటికే కొండంత అండగా నిలిచారు

* వస్త్ర పరిశ్రమ ప్రగతిలో మరింతగా రాణించేందుకు అన్వేషించాల్సిన మార్గాలపై , వనరులను ఉపయోగించుకుని, కొరతలు, వలసలను తగ్గించి, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఏపీని చేనేత రంగంలో మరింత రాణించడం కోసం అధ్యయనం చేసి ప్రక్షాళన చేస్తాం. 

* చేనేత రంగానికి సంబంధించిన

గత 7ఏళ్ల బకాయిలను (సుమారు రూ.1300కోట్లు)  ఈ ఏడాది చెల్లించనున్నాం

* రాష్ట్రంలో ఉత్పత్తైన నూలును ఫాబ్రిక్ గా మార్చడం, గార్మెంట్స్, గ్లోబల్ టెక్స్‌టైల్ రంగంలో  గమ్యస్థానంగా మార్చడంపై ప్రత్యేక చర్యలు

* వస్త్రాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా సంస్థలను, శిక్షణతో పాటు పరిశ్రమలతో సమన్వయం

చేసుకోవటానికి తగిన ఆర్థిక, మౌలిక సదుపాయాలు ,  ఇతర ప్రోత్సాహక విధానాలలో  కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా  అభివృద్ధి చేస్తాం.

*  వస్త్ర తయారీరంగంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా నిలిపేలా మౌలిక సదుపాయాలు అందిస్తాం. టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ అందిస్తాం.  దిగుమతి,ఎగుమతులు

సహా పోర్టులకు సమీపంలో  కారిడార్ల ద్వారా రవాణా సంబంధిత అంశాలలో అనుసంధానం చేసి సహకరిస్తాం.

* సహజవనరులను వినియోగించుకుంటాం..ఎటువంటి సవాళ్లనైనా స్వీకరిస్తాం

* నైపుణ్య చేనేత కళాకారుల విలువ పెంచుతాం

* మార్కెటింగ్ , బ్రాండింగ్ కు అవసరమైన సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ముందుంటుంది

*

చేనేత రంగానికి ప్రభుత్వం అన్ని విధాల బాసట

*  కోవిడ్ ప్రపంచంలో..వాణిజ్య, పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళుతున్నాం

* కొత్త పారిశ్రామిక విధానంతో వల్డ్ క్లాస్ వర్క్ ఫోర్స్ గా తీర్చిదిద్దుతాం

* 30 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసి, ప్రతిభ, నైపుణ్యం కలిగిన సహజ మానవవనరులను

సృష్టిస్తాం

* అన్నిరంగాలలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ను  శాశ్వత గమ్యస్థానంగా మార్చుతాం  

* నియమనిబంధనలు పాటిస్తూనే వాణిజ్యాన్ని విస్తరించే చర్యలు చేపడుతున్నాం

* పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో సత్తా చాటుతాం

* పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకువచ్చేందుకు అనువైన

అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం

* గత ఐదేళ్లుగా ఉన్న ఎమ్ఎస్ఎమ్ఈల బకాయిలను ఇప్పటికే రెండు విడతలుగా చెల్లించాం..

* పరిపాలనలో విధానంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలను, పారిశ్రామిక పాలసీ, ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక పరిపుష్ఠి కలిగించిన ప్రభుత్వ చర్యలను వెబినార్ లో

వివరించిన పరిశ్రమల శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది 

* శుక్రవారం మధ్యాహ్నం టెక్స్ టైల్ రంగంపై ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన వెబినార్ ను ప్రారంభించిన కేంద్ర చేనేత శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ

*   కర్ణాటక, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్

రాష్ట్రాలకు చెందిన చేనేత శాఖ మంత్రులు, హాజరయిన కేంద్ర టెక్స్ టైల్ శాఖ కార్యదర్శి రవికపూర్, జాయింట్ సెక్రటరీ జోగిరంజన్ పాణిగ్రహి, ఇతర రాష్ట్రాల  కార్యదర్శులు, 'ఇన్వెస్ట్ ఇండియా' సీఈవో, ఎండీ దీపక్ బగ్లా, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam