DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పరిపూర్ణానందను రాజకీయ ప్రత్యర్థిగానే చూసారు 

తెలంగాణ ప్రభుత్వం  à°“ట్ల కోసం à°Šà°¡à°¿à°—à°‚ చేస్తోంది. : వి హెచ్ పీ 

రాజకీయానికి హిందువులు బలి 

హిందూ వ్యతిరేక పాలనా సాగుతోంది. : వి హెచ్ పీ

విశాఖపట్నం,

జులై 11 , 2018 (DNS Online ): ఈ దేశ పరిస్థితులను మార్చే ఘటనలు అర్ధరాత్రే జరుగుతుంటాయి. ప్రధాన కారణం జనం నుంచి వ్యతిరేకత ఉండదని. దీనిలో భాగంగానే బుధవారం తెల్లవారుఝామున తెలంగాణ

ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చర్యకు యావత్ హిందూ సమాజం విస్తు పోయింది. టీఆరెస్ ప్రభుత్వం పూర్తిగా మైనారిటీలకు ఊడిగం చేస్తోంది అనే వాదన దీనితో వాస్తవం గా

తేలిందని విశ్వ హిందూ పరిషత్ మండిపడుతోంది. హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు పాదయాత్ర చేస్తానని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ప్రకటించగానే తెలంగాణ

ప్రభుత్వానికి జవసత్వాలు జారిపోయాయి. దీనికి ప్రధాన కారణం స్వామిజి గతం లో చేసిన ఒక ప్రకటనే దీనికి కారణం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ( తెలుగుదేశం, టి ఆర్

ఎస్ పార్టీలు )హిందూ సమాజానికి కనీస విలువ ఇవ్వడం లేదని, హిందువులు జరుపుకునే సభలకు సైతం అనుమతి ఇవ్వకుండా తీవ్రవాదులను చూసినట్టు తీవ్రమైన ఆంక్షలు

పెడుతున్నారని , హిందూ గుళ్లను పరి రక్షించాలని, లేని పక్షంలో తాము రాజకీయ ప్రవేశం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పరిపూర్ణానందకు ప్రజల్లో ఉన్న మద్దతు

తెల్సిన కేసీఆర్ భయపడి, స్వామిజి ని తెలంగాణ నుంచి బహిష్కరించడానికి భారీ కుట్ర చేశారు. దీని లో భాగం గానే రెండున్నర రోజుల పాటు స్వామిని గృహ నిర్బంధం చేసి,

అర్ధరాత్రి దొంగ తనంగా నగరం నుంచి తరలించారు. దీనికి తగినట్టుగానే తాము కూడా తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తామని హిందూ సమాజం హెచ్చరిస్తోంది.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam