DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 నుంచి ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19: ఎస్పీ అమిత్ బర్డర్

*అనాదరణకు గురైన చిన్నారులకు కరోనా నుంచి రక్షణ*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 13, 2020 (డిఎన్ఎస్):*  శ్రీకాకుళం జిల్లా పోలీసు సమావేశ కార్యాలయంలో సోమవారం 6 వ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 అనే కార్యక్రమం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాలపై

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి  అడిషనల్ డిజిపి సిఐడి, సునీల్ కుమార్ గారు 13 జిల్లాల యొక్క ఎస్పీ లతో మరియు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సదరు ఆపరేషన్ ముస్కన్ కార్యక్రమం గురించి సిఐడి అడిషనల్ డిజిపి వీడియో కాన్ఫరెన్స్ లో  మాట్లాడుతూ ఈ 6 వ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19  కార్యక్రమంనీ

ది 14. 7. 2020 నుండి 20. 20.2020 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క ఉత్తర్వులు మేరకు ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 అనే కార్యక్రమంలో వీధి బాలలు అనాదరణ కు గురైన టువంటి బాలబాలికలకు సంరక్షణ కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని  ఆదేశాలునిచాను. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దర్ ఐపీఎస్, వారు మాట్లాడుతూ ఇప్పటివరకు

ఐదుసార్లు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా వ్యాప్తి చెందుతున్న సమయములలో వీధి బాలలు మరియు అనాదరణకు గురైన టువంటి బాలబాలికలు, బాల కార్మికులకు ఆరోగ్య సంరక్షణ కొరకు తగినటువంటి చర్యలు ఇప్పటివరకు ఎవరూ కూడా తీసుకున్నట్లుగా సమాచారం లేనందున, ఈ 6వ ఆపరేషన్ ముస్కాన్

కోవిడ్-19 నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం, వీధి బాలలు, అనాధ అయినటువంటి బాలబాలికలు మరియు బాల కార్మికులకు కరోనా టెస్ట్ ను నిర్వహించడానికి ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని. జిల్లాలో ప్రతీ పట్న, గ్రామము నందు వీధి బాలలకు అనాధరణ కు గురైన బాలబాలికలకు కరోనా  టెస్ట్ చేయడానికి కావలసిన వైద్య

పరికరములను మరియు మొబైల్ వాహనములను ఏర్పాటు చేసుముని, సదరు మొబైల్ వాహనంలో కరోనా టెస్ట్ కిట్లను ఏర్పాటు చేసుకుని, బస్టాండ్ లలోను రైల్వే స్టేషన్ లలో మరియు బహిరంగ ప్రదేశాల్లో సంచరించే బాలబాలికలకు ముందుగా మాస్క్లను, శానిటైజర్ లను ఇచ్చి వారికి కరోనా  టెస్ట్లను నిర్వహించాలని,సంబంధిత అధికారులు అందరూ జిల్లా  కలెక్టర్

గారి తో సంప్రదించి ఈ ముస్కాన్ కార్యక్రమంలో టెస్ట్ నిర్వహించినటువంటి బాలబాలికలకు టెస్ట్ రిపోర్ట్ వచ్చేంతవరకు చైల్డ్ హోమ్  సెంటర్ లో వారికి ప్రేత్యేకంగా  ఆశ్రయం కల్పించాలని తెలియజేసినారు.  ఈ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 కార్యక్రమాన్ని నిర్వహించే సమయంలో ఆ కార్యక్రమంలో పాల్గొనే పోలీస్ అధికారులు అందరికీ ముందుగా

కరోనా టెస్టులు నిర్వహిస్తామని ఒకేసారి జిల్లా అంతటా నిర్వహించాలంటే కొంచెం కష్టం గా ఉంటదని, సదర్ కార్యక్రమమును ఒక్కకా  సబ్-  డివిజన్ లలో  ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 నిర్వహిస్తామని, కరోనా టెస్ట్ నిర్వహించడానికి కావలసిన వైద్య పరికరాలను గురించి డి. ఎం & ఎం .హెచ్. ఓ డిపార్ట్మెంట్ వారి యొక్క సహాయ సహకారాలు

తీసుకుంటామని తెలియజేసినారు అనంతరం ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 లోగునీ ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో సి.డబ్ల్యు.సి చైర్ పర్సన్, నరసింహమూర్తి, డి.సి.పి.ఓ కె. వి. రమణ , ఐ.సి.డి.ఎస్ డిపార్ట్మెంట్ నుండి కె నాగమణి, డి.ఎం & హెచ్ .వో. ఓ జగన్నాధం, లేబర్ డిపార్ట్మెంట్ నుండి పురుషోత్తం, స్టేట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, నోడల్

కోఆర్డినేటర్ సింహాచలం చైల్డ్ లైన్ మరియు అదనపు ఎస్పీ (పరిపాలనా) పి. సోమశేకర్, సీసీఎస్ సి.ఐ శ్రీనివాసరావు, డి.సి.ఆర్.బి, సి. ఐ . గోవిందరావు మరియు పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam