DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఫార్మా సిటీ లోని రాంకీ ఫార్మా లో భారీ ప్రేలుడు

*ఉవ్వెత్తున మంటలు, ఘటన స్థలానికి చేరుకోలేని ఫైర్ ఇంజన్లు. . .*

*2 కిలో మీటర్ల వరకూ భయాందోళనలో ప్రజలు.* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 13, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచినా జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ లోని  రాంకీ ఫార్మా

సంస్థలో లో భారీ ప్రేలుడు సంభవించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో రెండు కిలోమీటర్ల దూరం వరకూ ప్రజలు భయాందోళలోనే ఉన్నారు. రెండు కిలోమీటర్ల దూరం వరకూ మంటలు ప్రభావం ఉండడంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ ఇంజన్లు కూడా ఘటన స్థితి కి చేరుకోలేని స్థితి ఉంది. రాంకీ సంస్థలో సాల్వంట్ ను భద్రపరిచే రియాక్టర్ ట్యాంక్ లో

జరిగిన ప్రమాదంలో మంటలు లేచాయి. పెద్ద ఎత్తున మంటలు, భయాందోళనలో ప్రజలు. రెండు మూడు సార్లు భారీ శబ్దాలతో కూడిన ప్రేలుడు రావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్ సంబంధిత అధికారులను ఘటన స్థలానికి తక్షణం వెళ్ళవలసిందిగా ఆదేశించారు. ఇతర

అధికారులు సైతం ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam