DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాంకీ ఫార్మా లో సాల్వంట్ సంస్థలో ప్రమాదంలో సీనియర్ కెమిస్ట్ మృతి

*మరో 5 గురికి తీవ్ర గాయాలు, గాజువాక ఆర్కే ఆసుపత్రి లో చికిత్స* 

*2 నెలల్లో విశాఖ లోనే మూడు ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదాలు*   

*ప్రమాద సమయంలో అలారం మ్రోగలేదు, ప్రత్యక్ష సాక్షులు.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 14, 2020 (డిఎన్ఎస్):* సోమవారం అర్ధరాత్రి

విశాఖపట్నం పారిశ్రామిక వాడ జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ లోని రాంకీ సంస్థ కు చెందిన కోస్టల్ వేస్ట్  సాల్వంట్ సంస్థ లో జరిగిన అగ్ని ప్రమాదం లో ఒక సీనియర్ కెమిస్ట్ మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో ఐదుగురికి అతి తీవ్రగాయాలయినట్టు సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరణించిన

వ్యక్తి కాండ్రేగుల శ్రీనివాసరావు , సీనియర్ కెమిస్ట్ గా గుర్తించారు. ఇతని మృతదేహం ప్రమాద స్థలం దగ్గర గుర్తించారు. ఇతను అనకాపల్లి దగ్గర రేబాక గ్రామం కి చెందినవాడు. మల్లేష్ అనే వ్యక్తి కి 80 శాతం గాయాలయ్యాయి.  ప్రమాదం లో గాయాల పాలైన వారు గాజువాక ఆర్కే ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. 

తెల్లవారుఝామున

మొత్తానికి మంటలను ఆపగలిగారు. అయితే ప్రేలుడు శబ్దాలకు సమీపం లోని భవనాలు నేలమట్టం అయ్యాయి. మంటలు ఆరిన తదుపరి శిధిలాల క్రింద కార్మికుల ఎవరైనా ఉన్నారేమో అనే పరిశీలన చేస్తున్నారు. 

రాంకీ అనుబంధ సంస్థ లో జరిగిన ఈ  ప్రమాద సమయంలో అలారం మ్రోగలేదని, ప్రత్యక్ష సాక్షులు తెలియచేస్తున్నారు. ఇదే పరిశ్రమల్లో

గతంలోనూ ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తోంది. సంస్థ యాజమాన్యం నుంచి ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 

ఘటన జరిగిన సమయంలో ఎంతమంది సిబ్బంది ఎంతమంది విధుల్లో ఉన్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. సంస్థ కు చెందిన యాజమాన్యం ఇంతవరకూ ఎటువంటి సమాచారం ఇవ్వక పోవడం గమనార్హం. 

ఇదీ జరిగింది: . .. 
/> సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో రెండు కిలోమీటర్ల దూరం వరకూ ప్రజలు భయాందోళలోనే ఉన్నారు. రెండు కిలోమీటర్ల దూరం వరకూ మంటలు ప్రభావం ఉండడంతో మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ ఇంజన్లు కూడా ఘటన స్థితి కి చేరుకోలేని స్థితి ఉంది. రాంకీ సంస్థలో సాల్వంట్ ను భద్రపరిచే రియాక్టర్ ట్యాంక్ లో జరిగిన ప్రమాదంలో మంటలు లేచాయి. పెద్ద

ఎత్తున మంటలు, భయాందోళనలో ప్రజలు. పలుమార్లు భారీ శబ్దాలతో కూడిన ప్రేలుడు రావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్ సంబంధిత అధికారులను ఘటన స్థలానికి తక్షణం వెళ్ళవలసిందిగా ఆదేశించారు. ఇతర అధికారులు సైతం ఘటన స్థలానికి

చేరుకుంటున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam