DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లాలో విస్తృతంగా ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్ 19

*తొలి రోజు 32 మంది బాలబాలికలు గుర్తింపు,  సంరక్షణ*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 14, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా జూలై 14 నుండి జూలై 20 వరకు "ఆపరేషన్ ముస్కాన్" "సేవ్ చిల్డ్రన్ ఫ్రమ్ కోవిడ్ -19

నిర్వహించబడుతోందని జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా భిక్షాటన, మత్తుమందులకు అలవాటుపడిన, బాల కార్మికులను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాలలో గుర్తించి వీధి అనాథ బాలల ఆరోగ్య పరిస్థితి పరిశీలించి కరోనా టెస్టులు చేయించాలన్నారు. 
మాస్కులు, శానిటైజర్లు సరఫరా చేసే విధంగా

చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి. అన్నారు. బాలబాలికలకు మల్టివిటమిన్ ట్యాబ్లెట్లు, సి విటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వాలన్నారు. కరోనా పాజిటివ్ వస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత వసతి గృహాలలో ఉంచాలన్నారు. జిల్లాలో అనాథ వీధి బాలల రక్షణ, సంరక్షణ ఐ.సి.డి.ఎస్., సంస్థ నిర్వహిస్తుంది. బాల కార్మికుల తల్లి తండ్రులకు కౌన్సిలింగ్

చేసి వారిని తల్లి తండ్రుల వెంట పంపించటం జరిగింది. 

మొదటి రోజైన మంగళవారం మొత్తం 32 మంది చేరదీయడం జరిగిందని, వారిలో 11 మంది బాలికలు ఉన్నారన్నారు.  అనకాపల్లి - 15, చోడవరం - 5, వి. మాడుగుల-5, కసింకోట - 2, కోటవురట్ల - 1, నాతవరం-4, బాలబాలికలను పట్టుకున్నారు వారిలో అనకాపల్లి, చోడవరంనకు చెందిన మొత్తం 16 మందికి కోవిడ్ టెస్టు

నిర్వహించి వారిని సంరక్షణ కేంద్రాలకు పంపుతున్నామని ఎస్పి కృష్ణారావు  తెలిపారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam