DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు సమష్టి కృషే : తెలుగు దండు 

విశాఖపట్నం, జులై 11 , 2018 (DNS Online ) : తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు యావత్తు తెలుగు భాషా అభిమానుల సమష్టి కృషి అని తెలుగు దండు సమన్వయ కర్త పరవస్తు ఫణిశయన సూరి

అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగుభాష అభివృద్ధి కి తగిన కృషి చేయనున్నట్టు ప్రకటించడమే కాకుండా కార్యాచరణ దిశగా అడుగులు వేసినందుకు రాష్ట్ర మానవ వనరుల

శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు కు అభినందనలతో కూడిన కృతజ్ఞతలు తెలియచేయడం జరిగిందన్నారు. బుధవారం ఉదయం ఆయన్ను కలిసిన తెలుగు దండు సభ్యులు, ఆంధ్ర విశ్వ

కళాపరిషత్ తెలుగు శాఖ విద్యార్థినీ విద్యార్థులతో ( సుమారు 60  à°®à°‚ది) మంత్రి ముచ్చటించారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ మాతృ భాషా అభివృద్ధికి ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం సంపూర్ణ కృషి చేస్తుందని తెలిపారు. గతంలో ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగిందని, వాటికి సాంకేతిక పరమైన ఇబ్బందులు రావడం వలన, ఈ ప్రాధికార సంస్థ ఏర్పాటు

సాధ్యపడలేదన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు భాష అభిమానులు, తెలుగు అభివృద్ధి సంఘాలు, ప్రజలు చేసిన కృషి కి ప్రభుత్వం తగిన విధంగా స్పందించిందని,

దీనికి ప్రధాన భూమిక వహించినవారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, అన్నారు. అయన కృషి ఫలితమే ఈ రోజు తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు

అన్నారు. ఈ సందర్బంగా తెలుగు దండు సమన్వయ కర్త ఫణిశయన సూరి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికార భాష శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, అధికార భాష శాఖ

ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తదితరులకు ధన్యవాదములు తెలిపారు. సంస్థ అభివృద్ధి కి తమ వంతు సేవ చేయగలమని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పినట్టయితే మరోసారి

భారీ ఎత్తున ఉద్యమిస్తామని తెలియచేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam