DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇకపై సందర్శకులకు సింహగిరి గోశాల ద్వారాలు బంద్

*గోవులు బెదిరిపోతున్నాయిట, అందుకే అనుమతి ఇవ్వరుట*

*ఈఓ అనుమతి లేనిదే లోనికి ప్రవేశం లేదంటూ ఆదేశం.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 17, 2020 (డిఎన్ఎస్):* గత వారం రోజులుగా సింహాచలం దేవస్థానం గోశాల పై వెలువడుతున్న మీడియా వార్త కధనాల నేపథ్యంలో ఇక పై ఈఓ అనుమతి

లేకుండా సందర్శకులకు ప్రవేశం కల్పించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. 
శుక్రవారం ఉదయం ఇచ్చిన మౌఖిక ఆదేశాల ప్రకారం సింహాచలం పాత, కొత్త గోశాలల్లోకి కేవలం దేవస్థానం ఉద్యోగులు, అధికారులు మినహా సందర్శకులు, భక్తులు, మీడియా వారికీ సైతం అనుమతి లేదంటూ సమాచారం వెలువడింది. గత వారం రోజుల్లో జరిగిన వివిధ పరిణామాల నేపథ్యంలో

గోశాలలో గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారని, తద్వారా గోవులు భయపడిపోతున్నాయని, వాటికి ప్రశాంతత కల్పించే క్రమంలోనే అనుమతి లేకుండా ఎవ్వరినీ అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.  ఇక నుంచి గోశాల ను సందర్శించుకునే వారెవరైనా శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం సింహాచలం ఆలయ కార్యనిర్వహణాధికారి నుంచి

లిఖిత పూర్వక అనుమతి తప్పని సరి కానుంది. త్వరలోనే గోశాల సందర్శనకు టికెట్లు పెట్టె ఆలోచన లో కూడా ఉన్నట్టు సమాచారం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam