DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువుల తరపున మాట్లాడితే సంఘ విద్రోహ శక్తే : స్వామి పరిపూర్ణానంద 

హిందువులకి, హిందు ధర్మానికి అడ్డంగా నిలబడతా .  .

కాకినాడ. జులై 11 , 2018 (DNS Online ) : హిందూ సమాజ హితాన్ని కోరుకునేవారు సంఘ విద్రోహ శక్తే అని తెలంగాణా ప్రభుత్వం ఈ రోజు

కొత్త నిర్వచనం చెప్పిందని, శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఈయన్ని సంఘ విద్రోహ శక్తి గా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఈయన్ని రెండున్నర రోజుల పాటు

హైదరాబాద్ లో గృహ నిర్బంధం చేసి, బుధవారం తెల్లవారుఝామున కారులో కాకినాడకు తరలించారు.   సుమారు 18 à°—à°‚à°Ÿà°² కాలం పాటు సుదీర్ఘ కారు ప్రయాణం తర్వాత బుధవారం రాత్రి 11 à°—à°‚à°Ÿà°²

ప్రాంతం లో అయన కాకినాడ కు చేరుకున్నారు. మార్గ మధ్యలో కనీసం మంచినీరు కూడా త్రాగనిచ్చారో లేదో కూడా ఎవరికీ తెలియకుండా అయన పట్ల ప్రవర్తించిన తీరుపై స్వామిజి

న్యాయస్థానం లో సవాల్ చేయనున్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పి తీరాలన్నారు. తనను సంఘ విద్రోహ శక్తిగా ప్రకటించి, నగర బహిష్కరణ చేయడం తెలంగాణా ప్రభుత్వం,

పోలీసుల దుర్మార్గమని, తద్వారా హిందూ వ్యతిరేకులుగా తేలారన్నారు. హిందూ వ్యతిరేక శక్తులు ఈ దేశం పై పన్నుతున్న కుట్రల్లో భాగంగానే ఈ రోజు పైత్యం

ప్రకోపించిందాన్ని ధర్మ పోరాటం చేస్తే సంఘ విద్రోహ శక్తి గా ప్రకటించి, తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారన్నారు. తానూ ఇన్ని రోజులూ మౌనం గా ఉన్నానని, ఈ మౌనమే చాలా

ప్రశ్నలకు జవాబు చెప్తుందని తెలిపారు. 

సంకల్పాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.

సుమారు 18  à°—à°‚à°Ÿà°² పాటు నిరాహారం గానే ప్రయాణించానని, పోలీసులు తనతో వ్యవహరించిన

తీరు à°’à°• ఘోరమైన నేరం చేసిన వ్యక్తి తో వ్యవహరించిన తీరును తలపించింది, దీనికి ప్రతీ ఒక్కరూ న్యాయస్థానం లో సమాధానం చెప్పాల్సి యుంటుందన్నారు.  

సమాజ సేవ

చేసే నేను సంఘ విద్రోహ శక్తి : 

ఏ ప్రభుత్వం చెయ్యని ఏంటో సాహసమైన పనులు ఎన్నో చేసానని, దేనిలో భాగంగా సుమారు 300 గ్రామాలని దత్తతే తీసుకున్నాను. వెనుకబడ్డ

ప్రాంతాల పిల్లలకి గురుకులం పేరిట విద్యా బుద్ధులు ఉచితంగానే నేర్పిస్తున్నామన్నారు. వీటిల్లో చాలా ప్రాంతాలను ప్రభుత్వం వెలివేయబడినట్టుగా నిరాదరణకు గురి

చేసినవేనన్నారు. 

వేలాది గోవులను ఎందరో సామాన్య రైతులకి ఉచితంగా పెంచుకోడానికి ఇచ్చానని, వాటిని పోషిస్తూ, వ్యవసాయం కూడా చేసుకుంటూ, కుటుంబ పోషణ

చేసుకుంటున్నారని తెలిపారు. చాలా చోట్ల గో శాలలు నిర్వహిస్తున్నానని, ఇన్ని పనులు చేసిన నాలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులైతే, మరి సామాన్యులను దోచేస్తున్న

వాళ్లంతా ఎవరు అని ప్రశ్నించారు. 

లక్షలాది మందికి అన్నదానం చేస్తున్నానని, రెండు తెలుగు రాష్ట్రాల్లో 28 ఏళ్ళు  à°¸à±à°®à°¾à°°à± 44 సార్లు భగవద్గిత ను బోధించాను

కాబట్టి సంఘ విద్రోహ శక్తినే నన్నారు. 

నేను సెక్యులర్ ని కాదు . .. .. 

నేను సెక్యులర్ ని కాదనీ, సెక్యులర్ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే స్వచ్ఛమైన

హిందువుని. సర్వోన్నత హిందూ ధర్మానికి వారసులం. మా ధర్మం కచ్చితంగా పాటించే తీరుతామని, ఈ దేశం లో హిందూ ధర్మానికి గాని, హిందువులకు గానీ ఎవడైనా విఘాతం కల్గిస్తే

తానూ వారికి అడ్డంగా నిలబడతానని శపథం చేశారు. 
అంతకు ముందు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన స్వామికి ఆశ్రమ వాసులు ఘన స్వాగతం పలికారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam