DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం 

*రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్. ప్రతీప్ కుమార్* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 21, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పచ్చదనం పరిఢమిల్లేలా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్. ప్రతీప్ కుమార్

తెలిపారు. 71 వ వన మహోత్సవం ( జగనన్న పచ్చతోరణం) కార్యక్రమానికి బుధవారం ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా ప్రచార సామాగ్రిని ప్రతిప్ కుమార్ విడుదల చేసారు.  ఆయన మాట్లాడుతూ భావితరాలకు మేలు చెయ్యాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో 23 శాతం మాత్రమే ఆకుపచ్చదనం

వ్యాపించి ఉందని, మరో 10 శాతం మొక్కలు పెంచడానికి తమ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. వీటిల్లో 6 కోట్ల మొక్కలు నర్సరీల్లో అటవీ శాఖా సిద్ధంగా ఉంచిందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థ ప్రతి

నిధులు, విద్య సంస్థలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam