DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు తరలించలేదు: చైర్మన్ మల్లాది విష్ణు

*రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ శ్రేయస్సుకే కట్టుబడి ఉంది:*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 21, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి నిధులు అమ్మఒడి పధకానికి తరలించలేదని, ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ప్రకటించారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ, మరో నేత విష్ణువర్ధన్ చేస్తున్న ప్రచారాలు అభూత కల్పనలు అన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహనరెడ్డి బ్రాహ్మణుల శ్రేయస్సుకు కట్టుబడి ఉందని తెలిపారు. 

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెట్టబడిన “నవరత్నాలు”

లో భాగంగా, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబడుచున్న పథకం లో  జగనన్న అమ్మఒడి ప్రధానం అన్నారు. 

రాష్ట్రంలో  ఏ బిడ్డ చదువూ డబ్బులు లేకపోవడం వల్ల ఆగకూడదని, మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా “జనగన్న అమ్మఒడి”  పథకం  ద్వారా  ప్రతి  ఒక్కరికి

 రూ.15,000/-లు  లబ్ది  చేకూరుస్తున్నామన్నారు.  

2019-2020 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 42,33,098 మందికి  “జగనన్న అమ్మఒడి” పథకం ద్వారా ఈ క్రింద చూపినవిధంగా లబ్ది కల్పించటం జరిగిందని తెలిపారు.

ఈ పధకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిధులు పొందిన లబ్దిదారుల వివరాలను అయన ప్రకటించారు. 

రాష్ట్రంలో 2019

 - 20 విద్యా సంవత్సరం లో  మొత్తము 42,33,098 మంది తల్లులు (విద్యార్థుల తరపున) లబ్ది పొందారన్నారు. వారిలో . . .  

బి సి సామాజిక వర్గం లో 22,07,490 మంది, ఓ.సి సామజిక వర్గం లో 8,89,113 మంది, ఎస్. సి సామాజిక వర్గం లో 8,59,004 మంది, ఎస్.టి సామాజిక వర్గం లో 2,77,491 మంది లబ్ది పొందారన్నారు.  

బ్రాహ్మణులు 17, 611 మంది. . .

  

రాష్ట్రవ్యాప్తంగా 2019-20 సంవత్సరంలో ఓసి వర్గానికి చెందిన 8,89,113 మందికి  జగనన్న అమ్మఒడి  పథకం వర్తింపచేస్తే, అందులో 17,611 మందికి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పిల్లలకు లబ్ది చేకూర్చటం జరిగింది.

“జగనన్న అమ్మఒడి” పథకం క్రింద అర్హులైన 16,165 మంది తల్లులకు రూ.15,000/- లబ్ది చేకూర్చటానికి, ప్రభుత్వం

ఉత్తర్వులు ఆర్. టి. నం. 20, ఆర్థిక (ఎఫ్.ఎమ్.యు. రె) శాఖ తేదీ 03.01.2020 మరియు ఆర్. టి. నం. 18, ఆర్థిక (దేవాదాయ-1) శాఖ తేదీ 06.01.2020 ప్రకారం “అదనపు బడ్జెట్” క్రింద ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు రూ.24,24,75,000/- లు మంజూరు చేసి, నిధులు విడుదల చేయటం జరిగింది.

ప్రభుత్వ ఉత్తర్వులు ఆర్. టి. నం. 108, ఆర్థిక (ఎఫ్.ఎమ్.యు. రె) శాఖ తేదీ 17.01.2020 మరియు ఆర్.

టి. నం. 145, ఆర్థిక (దేవాదాయ-1) శాఖ తేదీ 17.01.2020 ప్రకారం “అదనపు బడ్జెట్” క్రింద రూ.2,16,90,000/- లు, ఈ పధకం క్రింద అర్హులైన 1,446 మంది లబ్దిదారులకు మంజూరు చేయటం జరిగింది.

మొత్తంగా, ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అర్హులైన 17,611 బ్రాహ్మణ సామాజిక వర్గ లబ్దిదారులకు  “జగనన్న అమ్మఒడి” పథకం క్రింద రూ. 26,41,65,000/- లు

“అదనపు బడ్జెట్” ద్వారా మంజూరు చేయటం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ దేవాదాయశాఖ పరిధిలో, కమీషనర్ ఎండోమెంట్స్ వారి పర్యవేక్షణలో పనిచేస్తుంది కాబట్టి, బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు పాలనాపరమైన ఉత్తర్వులు, ప్రభుత్వ బడ్జెట్, నిధుల మంజూరు, దేవాదాయ శాఖ ద్వారానే వస్తాయనే వాస్తవాన్ని

తెలియచేస్తున్నాము.

“జగనన్న అమ్మఒడి” పథకం ద్వారా లబ్ది చేకూర్చే క్రమంలో ఏ దేవాలయానికి సంబంధించిన నిధులు కాని, భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలు గాని, దేవాదాయశాఖ నిధులు గాని ఉపయోగించలేదని, కేవలం రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు మాత్రమే ఉపయోగించటం జరిగిందని, శ్రీ కన్నా లక్ష్మీనారాయణ, శ్రీ విష్ణువర్ధన్

రెడ్డి గార్లు గమనించగలరు.  వారు పూర్తి అవగాహనా లోపంతోనే విమర్శలు చేస్తున్నారని తెలియజేస్తూ, వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి వుందని, రాబోయే రోజుల్లో బ్రాహ్మణులకు ప్రభుత్వం ద్వారామరింత లబ్ది చేకూర్చడం జరుగుతుందని

తెలియజేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam