DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గవర్నర్ చెప్పక ముందే. . .అనే. . .నేను పలికిన చెల్లుబోయిన.

*మంత్రిని వారించిన గవర్నర్ కార్యదర్శి ముకేశ్ మీనా. .*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 22, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం లో కొత్తగా స్థానం దక్కించుకున్న రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వెంకట రమణ ప్రమాణ స్వీకారం లో రెండు క్షణాలు తొందర పడి కొన్ని పదాలు

ముందుగానే పలికేసారు. ప్రభుత్వ ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర గవర్నర్ నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. అయితే బుధవారం రాజ్  భవన్ లో సాదాసీదాగా జరిగిన కార్యక్రమం లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే

చెల్లుబోయిన వెంకట రమణ లతో  ప్రమాణస్వీకారం చేయించారు. 

ఈ కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నే మంత్రుల ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి పొంది, ముందుగా చెల్లుబోయిన వెంకట రమణను ఆహ్వానించారు. ఈ లోగా గవర్నర్ ఆసనం లో నుంచి లేచి నుంచునే లోగానే ఈయన చెల్లుబోయిన వెంకట రమణ అనే నేను. . .అని

పలకడం అందరిని ఆశ్చర్యం కల్గించించి. వెంటనే స్పందించిన గవర్నర్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఈయన్ని వారించారు. గవర్నర్ పాలక కుండా మీరు చదవకూడదు అని చెప్పడం గమనార్హం. తదుపరి కార్యక్రమం యధావిధిగా సాగింది. 

అదే వేదికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam