DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భీమవరం లో లయన్సు క్లబ్ చే కోవిడ్ రక్షణకై అవగాహన 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 23, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లోని   హౌసింగ్ బోర్డ్ వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద కోవిడ్19 నుండి రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియచేస్తూ బ్యానర్లు భీమవరం వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆళ్ల కృష్ణ భగవాన్ విడుదల చేసారు.

 పట్టణ ప్రాంతంలో విపరీతంగా ప్రజలు కోవిడ్ బారిన పడుతున్నారని, అత్యవసరం అయితేనే ప్రజలు బైటకు రావాలని, పట్టణంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల్లో వారిని పట్టణంలోకి అనుమతించట్లేదని, ప్రజలు కూడా స్వీయ గృహానిర్బంధంలోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు. 

కలెక్టర్, శాసనసభ్యులు గ్రంధి

శ్రీనివాస్ సూచనమేరకు 24 వ తేదీ నుండి భీమవరం పట్టణంలో లాక్ డౌన్ విధించడమైనదని నిబంధనలు చాలా కఠినతరంగా అమలుచేయనున్నట్లు CI తెలిపారు. జనసందోహం ఉన్న ప్రతీ ప్రాంతంలో లయన్స్ క్లబ్ వారు బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నందుకు లయన్స్ క్లబ్ వారిని అభినందించారు. భీమవరం పట్టణంలో ఈవిధంగా జాగ్రత్తలు తో కూడిన బ్యానర్లు పట్టణంలో

అన్ని కూడళ్ళలో ఏర్పాటు చేసిన మొదటి స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం లయన్స్ క్లబ్ కే దక్కుతుందని కొనియాడారు.

లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కంతేటి వేంకట్రాజు మాట్లాడుతూ ఇంత విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్యోగులు చేస్తున్న సేవలు అభినందనీయమని, ప్రతీఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు,, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్

అల్లు రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ అనేక సేవలు చేస్తోందని ప్రధానంగా కోవిడ్ 19 చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని ఎవరికివారే వారి ఆరోగ్యం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, కోవిడ్ బారిన ప్రజలు పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు పై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోందని

తెలియచేశారు. లయన్స్ కార్యదర్శి యామిజాల నరసింహా మూర్తి మాట్లాడుతూ మొదటి విడతగా బ్యానర్లు భీమవరం పట్టణంలో అన్ని పెట్రోల్ బంక్స్ మరియు అన్ని మెడికల్ షాప్స్ నకు అందిస్తున్నామని బ్యానర్లో సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని తెలియ చేశారు, లయన్స్ కోశాధికారి అల్లు తులసీ ప్రసాద్

మాట్లాడుతూ ఈరోజు కార్యక్రమంలో CI గారు పాల్గొని మంచి సూచనలు సలహాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియచేశారు.

పట్టణంలో గల అన్ని పెట్రోల్ బంక్స్ మరియు మెడికల్ షాప్స్ కి బ్యానర్లు అందచేయడం జరిగింది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam