DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో కరోనా. . వెన్నులో వణుకు పుట్టిస్తోంది : పీతల సుజాత 

*పిపిఈ కిట్ లేకుండా కరోనా బాధితుల తరలింపు. . .*

*ఫ్రంట్ లైన్ వారియర్లు జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించాలి. . .*

*మద్యం అరికట్టడం అంటే ధరలు పెంచడమేనా?*  

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 24, 2020 (డిఎన్ఎస్):* ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. . రాష్ట్రంలో కరోనా మహమ్మారి

ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేసారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజే 800 కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ ఆలోచించండన్నారు. ఇంత దారుణ పరిస్థితి ఉంటే వైకాపా కరోనా అంటే కామన్ ఫీవర్ గా చూసింది .. చిన్న పేరా సెట్మాల్ వేసుకుంటే చాలు అనే సందేశాన్ని ప్రజలకు

చెప్పడంతో .. కరోనా పట్ల ప్రజలకు భయం పోయింది .. దీంతో జనం రోడ్లపై జాగ్రత్తలు లేకుండా తిరగడంతో కరోనా విస్తరించిందని తెలిపారు. 

రాష్ట్రంలో అధికార లెక్కల ప్రకారం 884 మంది చనిపోయారు.. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 47 మంది చనిపోయారు మరి వీరి కుటుంబాన్ని ఎవరు ఆదుకున్నారు .. ఆ భాద్యత ప్రభుత్వానిది కాదా? అని

ప్రశ్నించారు. 

కనీస వసతులు లేని స్కూల్ బస్సుల్లోనే కరోనా బాధితులను తీసుకెళుతున్నారని, ఆఖరికి 
బాధితుడికి పీపీఈ కిట్ లు కూడా లేవన్నారు. ఇలా ఉంటే కరోనా వ్యాప్తి జరగదా అని ప్రశ్నించారు. 

జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించాలి. . .

ఫ్రంట్ లైన్ వారియర్లు గా ఉన్న జర్నలిస్ట్ లు కరోనా తో

చనిపోతున్నారని, .. ఇప్పటికి రాష్ట్రంలో 4 గురు జర్నలిస్ట్ లు చనిపోయారన్నారు. వీరికి ఏది భరోసా .. కనీసం ఇన్సూరెన్స్ కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.  జర్నలిస్ట్ ల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలన్నారు. 

కోవిడ్ ఆస్పత్రులలో కనీస సౌకర్యాలు లేవు ..సరైన భోజనం పెట్టడంలేదని

 ఎందరో బాధితులు స్వయానా వైద్య ఆరోగ్య శాఖా మంత్రికి వీడియో కాన్పరెన్స్ లో వివరించడం అందరు చూశారు .. ప్రభుత్వం మాత్రం ఒక్కో పేషేంట్ కి రోజుకు 500 ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకొస్తుందన్నారు. 

సరైన వైద్యం అందక బాధితులు చనిపోతున్నారు .. తిరుపతిలో ఇద్దరు జర్నలిస్ట్ సోదరులు .. అలాగే రాజమండ్రిలో ఆక్సిజన్ లేక రాము

అనే మరో సోదరుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు..  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam