DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న్యాయ వ్యవస్థకు ఎదురెళ్లి ఆర్టికల్‍ 356 ను తెచ్చుకోవద్దు

*జగన్ కు నర్సాపురం ఎంపీ రఘురాంకృష్ణంరాజు సూచన.* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 24, 2020 (డిఎన్ఎస్):* అనవసరంగా న్యాయ వ్యవస్థ కు ఎదురెళ్లి రాష్ట్రంలో ఆర్టికల్‍ 356ను కొని తెచ్చుకోవద్దని జగన్‍ పార్టీ తిరుగపాటు నర్సాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు సిఎంను హెచ్చరించారు. 
/>  
చెప్పుడు మాటలు విని ముఖ్యమంత్రి జగన్‍ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని చేజేతులా చెడగొట్టుకుంటున్నారన్నారు. 

ఆర్టికల్‍ 356ను ఎప్పుడు ఉపయోగిస్తారంటే.. ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పరిపాలనకు సిఫార్సు చేసేందుకే అమలు చేస్తారన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‍ కుమార్‍ వ్యవహారంలో

న్యాయవ్యవస్థతో చివాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని రఘురాం కృష్ణం రాజు జగన్‍ను ప్రశ్నించారు. నిమ్మగడ్డ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించటంతో జగన్‍ సర్కార్‍కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 

ఈ తీర్పుపై ఆర్‍ఆర్‍ఆర్‍ స్పందిస్తూ.. ఈ ఘాటైన వ్యాఖ్యలు

చేశారు.

ఇదంతా జరుగుతుందని తనకు ముందే తెలుసునని.. నేను సలహా ఇస్తే.. సిఎం స్వీకరించరని అన్నారు. సలహాదారులు ఎంత మంది ఉన్నా.. వారు ఏమో సరైన సలహాలివ్వరు. చెప్పుడు మాటలు విని ముఖ్యమంత్రి జగన్‍ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. న్యాయ వ్యస్థను కొంతమంది పార్టీ నేతలే కించ పరుస్తూ.. కొంతమంది సోషల్‍ మీడియాలో

పోస్టులు పెడితే.. పార్టీ పెద్దలే వారికి మద్దతు ఇవ్వటంలో మర్మం ఏమిటి..? విమర్శలు చేస్తే.. తప్పు ఏమిటి..? విమర్శలను స్వీకరించి సరి చేసుకోవాలి కదా.. మనం ఏం చేసినా.. పరవాలేదు అనుకుంటే.. న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. ఆర్టికల్‍ 356 ఎంతో దూరంలో లేదన్న విషయం జగన్‍ గుర్తుంచుకోవాలని జగన్‍ను ఆర్‍ ఆర్‍ ఆర్‍ హెచ్చరించారు. మా

ఎన్నికల ప్రణాళికలో కోర్టును గౌరవించాలని లేదు కదా… అనికోర్టును అవమాన పరిస్తే.. తస్మాత్‍ జాగ్రత్త అని ఆర్‍ ఆర్‍ ఆర్‍ అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజలలోకి తప్పుడు సంకేతికాలు వెళ్లాయి. వాస్తవాలను సిఎం జగన్‍ గ్రహించాలి. న్యాయ వ్యవస్థను గౌరవించాలి. ఆ వ్యవస్థపై చేస్తున్న విమర్శలకు పులిస్టాప్‍ పెట్టించాలి.

సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తే.. మీ•కు ఏమి నష్టం.? గవర్నర్‍ మాట కూడా మీరు వినలేదు. ఇప్పటికైనా సుప్రీం కోర్టు తీరును గౌరవించి.. ఉన్నతంగా ఆలోచించి.. ఎవరో చేప్పే తప్పుడు మాటలను ముఖ్యమంత్రి వినొద్దని సూచించారు. 

ఇప్పటికైనా ఎస్‍ఈసిగా నిమ్మగడ్డను నియమిస్తే.. కోర్టు తీర్పును గౌరవించినట్లు అవుతుంది..

లేకుంటే జరగబోయే పరిణామాలు ఏవైనా జగన్‍ స్వయంకృతాలే అంటున్నారు ఆర్‍ఆర్‍ఆర్‍. రాష్ట్ర మంతా కరోనా రోజు రోజుకు పెరిగిపోతుంటే.. కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని పదే పదే చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఏమైంది. కరోనాతో సహజీవనం చేస్తే.. బడ్జెట్‍లో కేటాయించే డబ్బు అంతా ఆరోగ్యశ్రీకే సరిపోతుంది.ఈ నాలుగేళ్లలో ఆ డబ్బు కూడా

సరిపోదు. ఇకనైనా బాద్యతగా ఉండండి. కరోనా తో సహజీవనం చేయండి అని మాటలు మాని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా మాస్కు వేసుకుంటే.. మిమ్ములను చూసి ప్రజలు నేర్చుకుంటారు అని ఆర్‍ ఆర్‍ ఆర్‍ స్పష్టం చేశారు. నాపై ఎన్ని ఫిర్యాదులు చేసినా…నాకు ఏం కాదు.. నిమ్మగడ్డ రమేష్‍ విషయంలో ఎలా బాధపడ్డారో.. అలా నా

విషయంలో కూడా జగన్‍ బాధ పడటం ఖాయం. ఒక ప్రజా ప్రతినిధి గొంతు నొక్కద్దు.. మీ బొమ్మ పెట్టి నేను గెలిచినా.. వాస్తవాలు ప్రశ్నిచంకూడదా అని రఘురాంకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam