DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆక్సిజన్ లేక పాత్రికేయుడు మరణించడం బాధాకరం

*పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్లు గా పరిగణించాలి.* 

*పాత్రికేయుల పరిస్థితిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన*  

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 24, 2020 (డిఎన్ఎస్):* ప్రాణాపాయ స్థితిలో ఆక్సిజన్ అందించకపోవడం మూలంగా రాజమండ్రికి చెందిన పాత్రికేయుడు సుంకర రామారావు

కన్నుమూశారని తెలిసి ఆవేదనకు లోనైనట్టు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఘటనపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. రామారావు కుటుంబానికి నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్టు తెలిపారు. 
రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు అదుపు తప్పాయి.

అలాంటి తరుణంలో ప్రభుత్వం ఆసుపత్రుల్లో తగినంతగా ఆక్సిజన్ నిల్వలు ఉంచాలి. ఆక్సిజన్ నిల్వలు తగినంత ఉండటం లేదని, ఆక్సిజన్ ను సమకూర్చే దిశగా చర్యలు చేపట్టడం లేదని జిల్లాల నుంచి పార్టీ నేతలు నా దృష్టికి తీసుకువచ్చారు. ప్రాణాధారమైన ఆక్సిజన్ విషయంలో దృష్టిపెట్టకపోతే ఈ విపత్కర పరిస్థితుల్లో రోగులు ప్రాణాలు కోల్పోవలసి

వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఆక్సిజన్ నిల్వల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.

పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్లు గా పరిగణించాలి: . . . 

పాత్రికేయులను కూడా ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పరిగణించాలన్నారు. కరోనా విపత్తు వచ్చినప్పటి నుంచి మీడియా ప్రతినిధులు ఎంతో

ధైర్యంగా భిన్న కోణాల్లో వార్తలు, కథనాలు అందిస్తున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేంద్రాలు, ల్యాబ్స్... ఇలా పలు ప్రదేశాల నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యం చేస్తున్నారు. పాత్రికేయులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ వైరస్

బారినపడుతున్నారు. కొందరు కన్నుమూయడం బాధాకరం. 

కరోనా బారినపడినవారికి అవసరమైన వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక దృష్టిపెట్టాలి. వారికిచ్చిన ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించడం లేదని పాత్రికేయ సంఘాల ప్రతినిధులు నా దృష్టికి తీసుకువచ్చారు. బీమా కార్డులు అన్ని ఆసుపత్రులు అంగీకరించేలా తక్షణం చర్యలు

తీసుకోవాలి. అలాగే ప్రెస్ అకాడెమీ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam