DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్వారంటైన్ లోని పోలీసులకు ఏలూరు డిఐజి మోహన్ రావు భరోసా 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 28, 2020 (డిఎన్ఎస్):* ఏలూరు రేంజ్ డిఐజి కె వి మోహన్ రావు రాజమహేంద్ర వరం  బొమ్మురు లోని కోవిడ్ -19 సెంటర్ లో క్వారంటైన్ మరియు హోమ్ క్వారంటైన్ లో కరోనా వైరస్ వ్యాప్తి లక్షణాల తో వైద్యము పొందుతున్న బాధిత పోలీస్ సిబ్బంది యోగ క్షేమాలను గురించి అడిగి

తెలుసుకున్నారు. మంగళవారం టెలీ  కాన్ఫరెన్స్ ద్వారా డిఐజి క్వంరంటైన్ లో ఉన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలతో మాట్లాడారు. వైద్యము పొందుతున్న  పోలీస్ లకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకొని, కరోనా వైరస్  బాధిత కుటుంబాలకు అండగా పోలీస్ యంత్రాగం అండగా  ఉంటాది అని బారోసా ఇచ్చినారు. కరోనా లక్షణ లతో

బాధ పడుతున్న  కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ లకు కావలసిన అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు, కావలసిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని డిఐజి  అధికారులకు తెలియ చేసారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో . . . 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ గోదావరి

జిల్లాలో ఉన్న ఏలూరు, కొవ్వూరు నర్సాపురం జంగారెడ్డిగూడెం మరియు పోలవరం డిఎస్పి లతో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ తెగలు అత్యాచారాల నిరోధక చట్టం కేసులపై చర్చించారు. జిల్లాలో   ఇప్పటివరకు నమోదు అయిన మరియు విచారణలో ఉన్న కేసులను గురించి, సదరు కేసులలో దర్యాప్తు గురించి, ముద్దాయిలు యొక్క అరెస్ట్ ను గురించి, ఈ కేసులో

దర్యాప్తు  అనంతరం చార్జిషీట్ లను కోర్టు లో ఫైల్ చేసే విషయాలపైన అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు సదరు దర్యాప్తు లో ఉన్న కేసులలో డి. ఐ.జి గారు అధికారులకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. ఎస్సీ & ఎస్ టి కేసులలో కోర్టులో విచారణ లో ఉన్నటువంటి కేసులలో ముద్దాయిలు యొక్క హాజరు సక్రమంగా

జరుగుతుంది లేనిది అనే విషయాన్ని పైన అధికారుల వద్ద నుండి వివరములు అడిగి తెలుసుకున్నారు.

డిఐజి కెవి మోహన్ రావు ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పి అద్నాన్ ఆస్మి, డియస్పి లు, ఏ.అర్  చింతూరు, రంపచోడవరం, కాకినాడ, అమలాపురం, రామచంద్రాపురం సిఐ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా

ఈస్ట్ గోదావరి జిల్లా నందు కరోనా  వైరస్ బారిన పడిన పోలీస్ సిబ్బంది కి ఏ విధమైనటువంటి వైద్య సదుపాయం అందిస్తున్నారు అనే విషయాలపైన  ప్రతి ఒక్కరిని గురించి కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కోరంటెన్, ఐసోలేషన్ మరియు ఆసుపత్రిలో, హోం క్వారంటైన్ లో వైద్యం సహాయ సహకారాలు అందించే విషయంలో ఉన్నత అధికారులు చొరవ

చూపాలని, కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అధికారులకు మనోధైర్యం కలగజేయాలని, ట్రాఫిక్ విధినిర్వహణ చేస్తున్న సిబ్బందికి ఫేస్ మాస్క్ లు, ఫేస్ షీల్డ్స్, శానిటైజర్ లు సరఫరా చేసి సిబ్బంది  కరోనా వైరస్ బారిన పడకుండా  తగిన జాగ్రత్తలు తెలియజేయాలని, సిబ్బందికి ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే నిమిత్తం యోగ , ప్రాణాయామ చేయించాలని,

వ్యాయామము, ఎండలో రోల్ కాల్ నిర్వహించుట వలన డి.విటమిన్ లభిస్తుంది అని, సీ.విటమిన్ అందించాలి అని తెలిపారు.  

ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలపై సిఐడి, ఏసీబీ, రైల్వే, ఇంటలిజెన్స్, ఏ పీ ఎస్ పీ,  విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎలక్ట్రికల్ విజిలెన్స్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు కూడా వైద్య పరమైన

ఎటువంటి సహాయ సహకారాలు అందించాలని, క్షేత్రస్థాయిలో ఉద్యోగ నిర్వహణ చేస్తున్న హోంగార్డు నుండి ఎస్ఐ స్థాయి అధికారుల వరకు కూడా  మనోధైర్యాన్ని కలగజేసే లాగా అధికారులు యొక్క సహకారము  ఉండాలని, కరోనా వైరస్ పట్ల పక్కా ప్రణాళికతో సిబ్బంది కి   కావలసిన ఇంజక్షన్లు గానీ మందులు గానీ ముందుగానే సమకూర్చుకుని పెట్టుకోవాలని,

సిబ్బంది కి  ఏ క్షణమైనా వైద్య సదుపాయాలు కల్పించడానికి, మందులు  అందుబాటులో ఉండాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డి. ఐ.జి తెలియజేసినారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam