DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం ఉపయోగించండి: గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి

*మీ ఇళ్లలో నేరాలు జరక్కుండా జాగ్రత్త వహించండి*

*గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి సూచన*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 28, 2020 (డిఎన్ఎస్):*  గుంటూరు అర్బన్ పరిధిలో పోలీసు వారిచే ఉచితంగా ఏర్పాటు చేసే లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టంను ప్రజలు ఉపయోగించు కొని,

తమతమ నివాసాలలో నేరాలు జరగకుండా చూసుకో వలసినదిగా మరియు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం గురించి ప్రజలలో అవగాహన పెంచేందుకు గాను గుంటూరు అర్బన్ ప్రచార రథం ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి తెలియ జేశారు. మంగళవారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమం లో ఈ విధానాన్ని

వివరించారు. 

గుంటూరు అర్బన్ నందు LHMS సేవలు పొందడానికి ఎవరు అర్హులు.

గుంటూరు అర్బన్ పరిధిలో నివసించేవారు ఎవరైనా, ఈ ఎల్.హెచ్.ఎమ్.ఎస్ సేవలు కోసం అర్హులు మరియు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా సులభం.

ఎల్ హెచ్ ఎం ఎస్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని పద్ధతి

అట్టివారు తొలుత ఆండ్రాయిడ్ ఫోన్

ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ LHMS యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. 

మీరు ఉండే ఇంటి వద్ద నుండి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేయగానే , ఓపెన్ అయి  వివరాలు కోరుతుంది. 

అప్పుడు వివరాలు నమోదు చేయగానే మీ  ఫోన్ కు ఓటీపీ వస్తుంది.

ఆ ఓటీపీ నమోదు

చేయగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి   మీ ఫోన్ కు యూజర్ ఐడి వస్తుంది. అది శాశ్వతముగా ఉంటుంది.

అట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు, తాము ఏదైనా ఊరు వెళ్ళే సందర్భంలో, తమ ఇంటిని నిఘాలో ఉంచుట కొరకు తిరిగి LHMS యాప్ ని ఓపెన్ చేసి , రిక్వెస్ట్ వాచ్ ఆప్షన్  ను క్లిక్ చేయవలసి ఉంటుంది. 

అప్పుడు దానిలో మీ

యూజర్  ఐడి  నమోదు పరచి  ఎప్పటి నుండి ఎప్పటి వరకు వారి ఇంటిని నిఘాలో ఉంచాలో మొదలైన వివరాలు పూర్తి చేయగానే LHMS సిబ్బంది ఆ ఇంటికి చేరుకొని, ఇంటిని పరిశీలించి విలువైన వస్తువులు ముఖ్యమైన గదుల్లో సీసీ కెమెరాలను ఉచితంగా ఫిక్స్ చేయడం మొదలైన పనులు పూర్తి చేస్తారు.

 తరువాత గృహస్తులు వెళ్లి పోయి వారి పనులు

చూసుకొని వచ్చే వరకు ఆ యొక్క ఇంటిని వాచ్ లో ఉంచుతారు.

 ఏదైనా ఇంకా కొన్ని రోజులు పాటు ఇంటికి రావటం వారికి కుదరక పోయినప్పుడు వాచ్ చేసే సమయాన్ని పెంచుకొనే వీలు కూడా దీనిలో ఉంటుంది.

ఎల్ హెచ్ ఎం ఎస్ పని చేయు విధానం

లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం విభాగం ఆర్బను పోలీసు కమాండ్ కంట్రోలు రూమ్ నందు

నిర్విరామముగా 24/7  సిబ్బంది అందుబాటులో అప్రమత్తంగా ఉంటారు.

సిస్టం ద్వారా సమాచారం రాగానే సంబంధిత పోలీస్ సిబ్బంది /  అధికారులను అప్రమత్తం చేస్తూ, ఎల్.హెచ్.ఎం.ఎస్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుంటారు.

అంతేకాకుండా అలారం మ్రోగుతుంది. అలారం మ్రోగగానే షిఫ్ట్ సిస్టమ్ లో పనిచేస్తున్న

ఎల్.హెచ్.ఎం.ఎస్ సిబ్బంది సంబంధిత ఏరియాలో ఉన్న పోలీస్ సిబ్బందిని /  సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతుంది.

ఈ లోపు స్థానిక పోలీస్ వారు ఆ ఇంటిని  గమనిస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇంటిలోనికి ఎవరైనా దొంగలు ప్రవేశించగానే ఆటోమేటిక్ గా కెమెరాలు అన్ని కదలికలను రికార్డు చేస్తాయి.

 వారు తక్షణమే

అక్కడకు చేరుకొని సదరు ఇంటిని చుట్టు ముట్టి అందులోకి వచ్చిన దొంగలను పట్టుకోవడం జరుగుతుంది.

గతంలో ఎల్ హెచ్ ఎం ఎస్ ద్వారా దొంగను పట్టుకున్న వైనం

ఈవిధంగా ది.16.11.2018 వ తేదీన పాత గుంటూరు పరిధిలో LHMS ఏర్పాటు చేసిన ఒక ఇంటిలో చోరీ చేయుటకు ప్రవేశించిన  తాళ్లూరి దేశాయ్  అనే దొంగను  దొంగతనం చేయు చుండగా

పోలీసు వారు చుట్టుముట్టి పట్టుకొని ముద్దాయిని కటకటాల వెనక్కి పంపినారు.

 పోలీస్ శాఖ ఉచిత LHMS సేవలు అందిస్తున్నందున ప్రజలందరూ ఈ సౌకర్యంను ఉపయోగించుకొని తమతమ ఇళ్లలో దొంగతనములు జరక్కుండా నివారించుకో వలసినదిగా అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., గారు తెలిపారు.

గుంటూరు అర్బన్ నందు ది.13-08-2017 వ

తేదీన ఎల్.హెచ్.ఎం.ఎస్ ప్రారంభించడం జరిగిందని, ఇప్పటివరకు గుంటూరు అర్బన్ నందు ఎల్ హెచ్ ఎం ఎస్ రిజిస్ట్రేషన్స్ 29,269 వరకు జరిగాయని, రిజిస్ట్రేషన్స్ సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని అమ్మిరెడ్డి గారు తెలిపారు.

   గుంటూరు అర్బన్ పరిధిలో పోలీస్ ప్రచార రధం టీం సభ్యులు వారి వారి విధులతో పాటు ప్రతిరోజు

సాయంత్రం వేళల్లో గుంటూరు ఆర్భన్ పరిధి లోని వివిధ కూడళ్ళలో నేటి సమాజములో జరుగు చున్న వివిధరకాలైన మోసాలు / నేరాలకు సంబంధించిన, మత్తు పదార్ధాల వల్ల అనర్ధాలు, అత్యాచారాల నిరోధానికి మొదలైన విషయాలలో మరియు Covid-19 కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి / పాటించవలసిన నిబంధనలు గురించి లఘు చిత్రాల

ద్వారా / వాయిస్ రికార్డింగ్స్ ద్వారా / ప్రత్యక్షంగా లౌడ్ స్పీకర్స్ ఉపయోగించి మాట్లాడటం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించ వలసిందిగా ఎస్పీ అమ్మిరెడ్డి గారు ఆదేశించారు. 

 ఈ సందర్భంగా ప్రజలందరూ తమతమ ఇండ్లలో చోరీలు జరగకుండా ఉండేందుకు గుంటూరు అర్బన్ పోలీసులు ఉచితంగా

అందిస్తున్న LHMS సేవలు ఉపయోగించు కోవాలని, తద్వారా నేరాలు అరికట్టడంలో పోలీసు వారికి సహకరించాలని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలియ జేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam