DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశంలోనే తొలిసారి సిక్కోలు వర్శిటీ జాతీయ స్ధాయి వెబినార్లు

*జాతీయ సెమినార్లు నిర్వహణలో శ్రీకాకుళం వర్సిటీ ముందంజ* 

ఉన్నత పాఠశాల విద్యార్ధుల నుండి పి.జి విద్యార్ధుల వరకు అవకాశం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 29, 2020 (డిఎన్ఎస్):* కరోనాసురుడి విజృంభణతో విద్యాలయాల పరిస్ధితి, విద్యార్ధుల భవిత ప్రశ్నార్ధకం కాగా,

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోగల డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం వినూత్న ప్రయోగాలతో ముందుకు వెళుతోంది. కోవిడ్ 19 మహమ్మారి ఒక వైపు నుండి ప్రజలను కదలనీయని స్ధితిలోకి నెట్టడంతో విద్యార్ధులు తరగతి గదుల్లో బోధనలు కోల్పోవడం జరిగింది. ఈ తరుణంలో విశ్వవిద్యాలయం జూన్ నెల నుండి ఆన్ లైన్ లో వివిధ సెమినార్లను నిర్వహిస్తూ

విద్యార్ధులు, ఆచార్యులు తమ పరిజ్ఞానం పెంపొందించుకోవడం, ఇతరులతో పంచుకోవడం జరిగింది. తాజాగా ఉన్నత పాఠశాల విద్యార్ధుల నుండి పోస్టు గ్రాడ్యుయేట్ స్ధాయి వరకు తమలో నిఘూడంగా దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి విశ్వవిద్యాలయం ఒక మంచి ప్రయత్నం ప్రారంభించింది. 
73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేషనల్

రిసెర్చ్ డెవలప్ మెంటు కార్పొరేషన్, లారస్ లాబ్ ల సౌజన్యంతో విద్యార్ధుల సృజనాత్మక శక్తులను వెలికితీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆగష్టు 8వ తేదీ వరకు విద్యార్ధుల నుండి వివిధ అంశాలపై మోడల్స్, పత్రాలు స్వీకరిస్తుంది. సమర్పంచిన మోడల్స్, పత్రాల్లో అత్యుత్తమ అంశాలను ఎంపిక చేసి బహుమతులను కూడా

భారీగా అందజేయుటకు నిర్ణయించింది. మూడు  మొదటి బహుమతులుగా లక్ష రూపాయలు చొప్పున, మూడు ద్వితీయ బహుమతులకు రూ.50 వేలు చొప్పున, మూడు తృతీయ బహుమతులుగా రూ.25 వేలు చొప్పున అందించనున్నారు. 
    విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పొఫెసర్ కె.రఘుబాబు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా విద్యార్ధులకు తరగతులు నిర్వహించే పరిస్ధితి

లేదన్నారు. ఈ తరుణంలో విద్యార్ధుల తెలివితేటలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయుటకు సెమినార్లను ఉద్దేశించామని చెప్పారు. హైస్కూల్ నుండి పి.జి స్ధాయి విద్యార్ధులు ఇందులో పాల్గొనుటకు అవకాశం కల్పించామని, ప్రతి బృందంలో 5 గురు వరకు విద్యార్ధులు, ఒక మెంటార్

ఉండవచ్చని ఆయన చెప్పారు. ఆగష్టు 8వ తేదీ నాటికి విద్యార్ధులు తమ వ్యాస పత్రాలు, మోడల్స్ సమర్పించవచ్చని, ఎంపిక చేసిన పత్రాలు, మోడల్స్ ను ఆగష్టు 9 నుండి 14వ తేదీ మధ్య ఆన్ లైన్ లో విద్యార్ధులు ప్రదర్శించాలని చెప్పారు. వాటిలో  అత్యుత్తమ మోడల్స్ ఎంపిక చేసి ఆగష్టు 15వ తేదీన తుది ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని రఘు పేర్కొన్నారు.

దేశం నలుమూలల నుండి విద్యార్ధులు పాల్గొనవచ్చని ఆయన పేర్కొంటూ ప్రస్తుత తరుణంలో దేశాభివృద్ధిలో యువత పాత్ర గణనీయంగా ఉందని, విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొని మంచి సూచనలు సలహాలు అందించాలని కోరారు. ఆన్ లైన సెమినార్లపై విద్యార్ధులకు, మెంటార్లకు అవసరమగు సమాచారం కోసం ప్రొఫెసర్ కె.రఘుబాబు, 9440114243 లేదా drraghualways@yahoo.co.in కు

సంప్రదించవచ్చని చెప్పారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.brau.edu.in ను కూడా సంప్రదించవచ్చని ఆయన వివరించారు. 
    ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్ధులకు (High school and college Jr. College) 1. స్థిర గ్రామీణాభివృద్ధి (Sustainable Village development), 2. సమాజాభివృద్ధి — ఆరోగ్య భద్రతా మార్గాలు (Community development - models for preventive health care), 3. సామరస్య మరియు నాణ్యమైన

జీవితం (Harmonious and quality life), 4. స్థిరమైన నీటి వనరుల నిర్వాహణ (Sustainable water resource management), 5. సంపూర్ణ అక్షరాస్యత - ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన (Hundred percent literacy & awareness on financial literacy) అంశాలలోను.,  
    డిగ్రీ స్ధాయి (Degree ) విద్యార్ధులకు 1. యువత - సామాజిక బాధ్యత (Demographic dividend and societal responsibility), 2. చక్ర రూప ఆదాయ ప్రవాహం మరియు వ్యర్ధాల నిర్వహణ (Circular economy and waste management ), 3. సస్య ప్రణాళిక -

సేంద్రియ వ్యవసాయం మరియు విక్రయాలు (Crop planning - organic farming and marketing), 4. సుపరిపాలన మరియు ఉత్తమ అభ్యాసాలు (Good governance and best practices), 5. కల్తీ - వినియోగదారుని రక్షణ (Adulteration and consumer protection) అంశాలలోనూ., 
    పి.జి మరియు ఇంజనీరింగు స్ధాయి విద్యార్ధులకు (P. G. & Engineering ) 1. స్వయం ప్రతిపత్తి నిర్మాణ దిశగా ఆంధ్ర ప్రదేశ్ (Making Andhra Pradesh self reliant), 2. ప్రకృతి విపత్తుల నిర్వహణ -

పర్యావరణ సమతుల్యనిర్మాణం (Natural disaster management - eco friendly architecture), 3. విపత్తులు, అంటురోగాలు మరియు ప్రపంచవ్యాప్త అంటు వ్యాధుల తగ్గుదలలో వైయక్తిక పాత్ర (Role of the individual in mitigating calamity, epidemic & pandemic), 4. ఆహార భద్రతకై రెండో హరిత విప్లవం - అధునాతన వ్యవసాయం మరియు సమాచార సాంకేతిక విద్యల పాత్ర (Second green revolution for food security - role of agriculture technology and IT), 5. సంపూర్ణ అభివృద్ధి – విశ్లేషణ (Big data analytic

for sustainable development)

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam