DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యా మంత్రిత్వశాఖ గా మానవ వనరుల శాఖ మార్పు 

*ఇకపై 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్య*

*కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయానికి ఆమోదం.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*న్యూ ఢిల్లీ /  విశాఖపట్నం, జూలై 29, 2020 (డిఎన్ఎస్):* కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వ

మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ఢిల్లి లో జరిగిన మంత్రి వర్గ సమావేశం లో నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేశారు. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది.  నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం

ఉండనున్నట్టు సమాచారం. 

ఈ విధానం లో 5+ 3+ 3+ 4 విధానంలో విద్యా విధానం అమలులోకి రానున్నట్టు సమాచారం.

3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం నూతన విద్యా విధానం

కొత్త విద్యా విధానంలో మారనున్న సిలబస్ అంశాలు:  వృత్తి, ఉపాధి లభించే విధంగా నూతన విద్యా విధానం

ఉపయోగ పడుతుందంటున్న కేంద్రం

నూతన విద్యా విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా, ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారని సమాచారం

నూతన విద్యా విధానం కోసం ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్న

కేంద్రం

నూతన విద్యా విధానం పై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియల్ పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam