DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా కట్టడి లో అధికార్ల బాధ్యతా రాహిత్యం పై సీఎం ఆగ్రహం

*ప్రభుత్వ ఆదేశాలు పాటించడం లేదు: సీఎం ఆగ్రహం.* 

*ఇన్ కెమెరా మీటింగ్ లో కలెక్టర్లు, జెసి ల పై మండిపాటు.*

*అయితే సీఎం బహిరంగంగా ఆగ్రహించిన దాఖలాలు లేదు*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 30, 2020 (డిఎన్ఎస్):* కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా

వ్యవహరిస్తున్నప్పటికీ.. జిల్లాల కలెక్టర్లు, జాయింట్‍ కలెక్టర్లు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని.. ముఖ్యమంత్రి జగన్‍ భావిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా బయటకు పొక్కింది. ఇప్పటి వరకు వీడియో కాన్ఫరెన్స్తో కానీ.. వారితో మాట్లాడినప్పుడు కానీ.. ఎలాంటి మందలింపులు, హెచ్చరికలు జగన్‍ ఇంత వరకు చేయలేదు. దీనిని

కొంత మంది కలెక్టర్లు, జాయింట్‍ కలెక్టర్లు తేలికగా తీసుకుంటున్నారని జగన్‍కు అనుమానం కలిగిందట. అందుకేనేమో జిల్లాలలో జరిగే పరిణామాలకు కలెక్టర్లు, జాయింట్‍ కలెక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని.. జగన్‍ వారిని హెచ్చరించారు. దీందో కలెక్టర్లు, జాయింట్‍ కలెక్టర్లు సిఎం ఆవేశాన్ని ఎక్కడ చవి చూడాల్సి వస్తుందేమో అని

ముందు జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలిసింది.

సిఎంతో సమావేశం ముగిశాక.. కలెక్టర్లు… స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించి కరోనా వ్యాది వివరాలపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారట. దాదాపుగా అన్ని జిల్లాలలో కోవిడ్‍ అధికారులే కోవిడ్‍ సెంటర్లు, ఐసోలేషన్‍ వార్డులకు బాధ్యత వహిస్తున్నారు. ఇకపై

జిల్లాలలో పాజిటివ్‍, నెగటివ్‍ కేసుల వివరాలు, ఖాళీగా ఆసుపత్రులలో ఉన్న బెడ్స్ వివరాలు గురించి వెంటనే ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోవిడ్‍ అధికారులను కలెక్టర్లు ఆదేశించారు. ముఖ్యమంత్రిగా జగన్‍ బాధ్యతలు స్వీకరించాక.. మొదటి సారి కలెక్టర్లతో కటువుగా మాట్లాడటం… అన్నింటికీ మీదే బాధ్యత అని హెచ్చరించటంతో..

జిల్లాల అధికార యంత్రాంగం వేగంగా పనిచేసే అవకాశాలుంటాయేమో వేచి చూడాల్సిందే. సోషల్‍ మీడియాతో పాటు టివి ఛానెళ్లలో జరుగుతున్న ప్రచారాలపై వెంటనే స్పందించాలని సిఎంవో అధికారి ఒకరు ఆదేశించినట్లు తెలిసింది. ఇదే విషయంపై జగన్‍ కూడా సమావేశంలో మాట్లాడుతూ కరోనా పాజిటివ్‍గా నిర్దారణ అయిన వ్యక్తులు దగ్గరగా ఉన్న

ఆసుపత్రులకు వచ్చి బెడ్‍ కావాలని అడిగిన 30ని.ల లోపు వారికి బెడ్‍ చూపించకపోతే.. ఆ తరువాత జరిగే పరిణామాలకు మీరే కారణమని సిఎం హెచ్చరించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam