DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయోధ్య శ్రీరామ మందిర భూమి పూజకు వెళ్ళండి: నర్సాపురం ఎంపీ

*చారిత్రాత్మక ఘట్టం లో రాష్ట్రం తరపున భాగస్వాములు అవ్వండి* 

*ఎస్వీబిసి లో లైవ్ ఇవ్వండి - కోట్లాది మంది భక్తుల మన్ననలు పొందండి*

*దేవాదాయ శాఖలోని 24 వేల ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరపండి*

*వైఎస్ జగన్ కు నర్సాపురం ఎంపీ రఘురామ్ సూచన* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 31, 2020 (డిఎన్ఎస్):* ఆగస్టు 5 న ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జరుగుతున్న శ్రీరామ చంద్రప్రభువు జన్మస్థలంలో నిర్మితమవుతున్న శ్రీరామ మందిర నిర్మాణానికి జరుగుతున్న భూమి పూజ అఖండ భారత దేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన మహోత్సవం.  
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపున పాల్గొని,

చారిత్రాత్మకమైన మహోత్సవం లో  భాగస్వాములు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి నర్సాపురం లోక్ సభ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు సూచించారు. శుక్రవారం విడుదల చేసిన ఒక బహిరంగ లేఖలో తెలిపారు. 

కరోనాసురుడు విజృంభిస్తున్న సందర్బంగా భక్తులు ఎవరికీ ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనుమతి

లేదని, కేవలం భారత దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా పాల్గొని భూమి పూజ నిర్వహిస్తారన్నారు. 

కోట్లాది మంది హిందువుల వేలాది సంవత్సరాల చిరకాల వాంఛ అయినా అయోధ్య రామ మందిరం ప్రారంభం ఒక అపురూపఘట్టమన్నారు. దీనిలో

పాల్గొనడం పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఈ అవకాశం కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మాత్రమే ఉందన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. 

ఆగస్టు 5 న రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధి లోని 24 వేల ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరపాలని, వేదమంత్రాలతో ఆయా దేవీదేవతలు విశిష్ట అర్చనలు నిర్వహించాలని

సూచించారు. 

ఎస్వీబిసి లో లైవ్ ఇవ్వండి :

ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మొత్తం హిందూ సమాజం అంతా చూసి తరించే విధంగా శ్రీవెంకటేశ్వర భక్త ఛానెల్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చెయ్యాలని కోరారు. ఈ మేరకు టిటిడి పాలక మండలికి సూచించాల్సిందిగా ఎంపీ కోరారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam