DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 31, 2020 (డిఎన్ఎస్):*  ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2020’ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ

సందర్భంగా ఆన్‌లైన్‌లో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అలాగే నూతన విద్యా విధానంపైనా ప్రధాని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.

విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా 2017 నుంచి స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం

చూపేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రారంభమైన తొలి ఏడాదే 42వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2019కి ఆ సంఖ్య రెండు లక్షలకు పెరిగింది. ఇక ఈసారి తొలి రౌండ్‌కే 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తుది రౌండ్‌లో లక్ష మంది పాల్గొననున్నారు. 37 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 17 రాష్ట్ర ప్రభుత్వాలు, 20

పరిశ్రమలు పంపిన సమస్యలకు తుది రౌండ్‌లో విద్యార్థులు తమ పరిష్కారాలను తెలపనున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam