DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో పటిష్టమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకై శ్రీకారం 

*విశాఖ సీపీ చైర్మన్ గా ఐపీఎస్ లతో  ఒక కమిటీ నియామకం* 

DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)

అమరావతి, ఆగస్టు 01, 2020 (డిఎన్ఎస్): ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నంపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి సారించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతో మరింత భద్రత చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ

మేరకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ శనివారం  ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 
విశాఖపట్నం సీపీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో నలుగురు ఐజీలు( ట్రైనింగ్‌ ఐజీ, పర్సనల్‌ ఐజీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ, పీఅండ్‌ఎల్‌ ఐజీ),  ఇద్దరు డీఐజీలు(టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీ, విశాఖ రేంజ్‌ డీఐజీ),  ప్లానింగ్‌ ఓఎస్‌డీ

సభ్యులుగా ఉన్నారు. విశాఖలో అదనపు సిబ్బంది, సదుపాయాలు, పోలీస్‌ శాఖకు అవసరమైన మౌలిక వసతులపై కమిటీ అధ్యయనం చేయనుంది. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని డీజీపీ సవాంగ్‌ ఆదేశించారు. కాగా, వికేంద్రీకరణ ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లులకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోద ముద్ర వేసిన విషయం

తెలిసిందే.  తాజా నిర్ణయంతో ఇకపై పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఆవిర్భవించనున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam