DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాడిపరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట: మంత్రి సీదిరి అప్పలరాజు

(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)

శ్రీకాకుళం,  ఆగస్టు 01, 2020 (డిఎన్ఎస్):

ఆగస్టు, 1: వ్యవసాయ  అనుబంధ రంగాలైన  మత్స్యకార, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పేట వేస్తుందని  రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సిదీరి అప్పలరాజు అన్నారు. మండలంలోని లింగాలవలస గ్రామంలో

జాతీయ ఉచిత కృత్రిమ గర్భోత్పత్తి రెండవ విడత పథకాన్ని మంత్రి లాంఛనప్రాయంగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మానస పుత్రిక వంటివని అన్నారు. ప్రతి పంచాయతీ  సచివాలయంలో రైతు భరోసా కేంద్రాలు వద్ద ప్రాథమిక పశువైద్యశాలలు ఏర్పాటు

చేశామన్నారు. ఇందుకు సిబ్బందిని కూడా నియమించామన్నారు. ఏ ఒక్క పాడి రైతు పశు వైద్య నికి దూరం కాకూడదు అన్నది ప్రభుత్వ  ఆలోచన అని అన్నారు. అందులో భాగంగా పశువులకు నిర్దేశిత కాలంలో డి వార్మింగ్, వ్యాక్సినేషన్, రైతులకు శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో రైతు భరోసా కేంద్రాలు వద్దే పాలఉత్పత్తి

సేకరణ చేస్తామని అని, అందుకు బడ్జెట్లో కొంతమేర నిధులు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పాడి పశువులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించామని అందులో భాగంగా ఇనాఫ్ ట్యాగింగ్ ద్వారా పాడి పశువులకు రూ. 30వేలు, గొర్రె,మేకలకు 6000 నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతా కు జమ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 60 కోట్ల మేర పరిహారాన్ని

నేరుగా రైతుల ఖాతాలకు చెల్లించామని,అందులో జిల్లాలో కోటికి పైగా పశు నష్టపరిహారాన్ని అందించామన్నారు. రాష్ట్రంలో ఎంపికకాబడ్డ తొమ్మిది జిల్లాల్లో జాతీయ ఉచిత కృత్రిమ గర్భాదారణ ఉత్పత్తి పధకం క్రింద 50 శాతం కంటే తక్కువ గర్భ ధారణ జరుగుతున్న ప్రాంతాలలో గర్భధారణ ,పాల ఉత్పత్తులను పెంచడం జరుగుతుందన్నారు. ఎంపికైన  500

గ్రామాల్లో 100 పశువులకు గర్భధారణ ఎనిమిది నెలల కాలంలో 50వేల దూడలు అభివృద్ధి, 4కోట్లా 50 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్ధ్యం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పథకం క్రింద 90కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం కల్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు. వైయస్సార్ ఆర్ చేయూత కింద 25లక్షల మందికి ఆర్థిక సహాయం అందజేశామని, వైయస్ఆర్ ఆసరా పథకం

కింద 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకు నాలుగు విడతలవారిగా రుణమాఫీ చేయనున్నామన్నారు. మహిళల  జీవన ప్రమాణాలు పెంచాలన్నదే ముఖ్యమంత్రి  ఆశయమని అన్నారు.
అనంతరం ఉచిత కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమం గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. 
జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లా లో అపారమైన అవకాశాలు ఉన్నాయని యువత వాటిని

సద్వినియోగం చేసుకోవాలన్నారు. 
ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి డా,కిల్లి కృపారాణి, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఈశ్వరరావు, ఉప సంచాలకులు డా, మంచుకరుణాకర్ రావు, మాజీ జెడ్పీటిసి సభ్యులు దువ్వాడ వాణీ, నాయకులు దువ్వాడ శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam