DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విమ్ స్ ఆసుపత్రిలో మంత్రి పర్యటనను అడ్డుకున్న బాధిత బంధువులు

*Min Avanti obstructed at VIMS for poor facilities by patients relatives*

*విమ్ స్ లో మరణాలకు వైద్యులపై కేసు పెడతాం : బాధితులు* 

*మంత్రి విమ్ స్ పర్యటన లో అడ్డుకున్న బాధిత బంధువులు* 

*వైద్యులు డ్యూటీలు చెయ్యడం లేదు,  పేజీలు కూడా చుట్టపు చూపే. .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,

 ఆగస్టు 03, 2020 (డిఎన్ఎస్):* విశాఖ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విమ్ స్ ఆసుపత్రి లో వైద్య సదుపాయాలను పరిశీలనకు వచ్చిన రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బాధిత కుటుంబాలు చుక్కలు చూపించాయి.  ప్రభుత్వ ఆసుపత్రిలో పెరుగుతున్న కోవిడ్ రోజుల మరణాలపై వైద్యులపై కేసులు పెడతామని బాధిత కుటుంబాలు మంత్రి అవంతి

ఎదుట హెచ్చరించాయి. సోమవారం ఆసుపత్రి పర్యటనకు వచ్చిన అయనకు వైద్యులు వివరించిన అంశాలను మీడియా ముందు తెలియచేస్తున్న సమయంలోనే బాధిత కుటుంబాల సభ్యులు ఒక్కసారిగా మంత్రి ని ప్రశ్నించారు. బెడ్ లు, గదులు ఉన్నాయని, వైద్యులు మాత్రం విధుల్లోకి రావడం లేదని ఖరాకంఢీగా తేల్చి చెప్పారు. దీనికి నిదర్శనంగానే ఆసుపత్రిలో చికిత్స

కోసం చేసిన వాళ్ళు లోపల పరిస్థితిని వీడియో ద్వారా బయటకు పంపడం సంచలనంగా మారింది. దీనిపై విమ్ స్ డైరక్టర్ మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి సోమవారం ఆసుపత్రికి వచ్చారు. 

అవంతి మీడియాతో మట్లాడుతుండగా ఓ మహిళ అడ్డుకుంది. తన భర్త మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వాపోయారు. విమ్స్

ఆస్పత్రి వైద్యులపై కేసు పెడతానంటూ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఆసుపత్రిలో అత్యధికంగా జీతాలు తీసుకునే రెగ్యులర్ వైద్యులు ఆసుపత్రిలోనే ఉంటారని, డ్యూటీ లు చెయ్యడం లేదని, కేవలం పీజీ వైద్య విద్యార్థులు మాత్రం ఉంటారన్నారు.  పూర్తి స్థాయి సౌకర్యాలు లేవని, సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆవేదనవిమ్స్​లో

మంత్రి అవంతిని కరోనా రోగుల బంధువులు నిలదీశారు. 

కొవిడ్‌తో చికిత్స పొందుతున్న తమ తండ్రి చనిపోయిన విషయాన్ని చెప్పలేదంటూ... బాధిత కుటుంబసభ్యులు అవంతిని నిలదీశారు. మరణవార్త దాచిపెట్టి ఖననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేవంటూ మరికొందరు అవంతిని

అడ్డగించారు. 

పోలీస్ మృతికి కూడా వైద్యుల నిర్లక్షమే కారణం.

డ్యూటీ చెయ్యడానికి గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ కు పూర్తి ఆరోగ్యంగా వచ్చిన ఒక పోలీస్ ఉద్యోగి కి విశాఖ లో కరోనా రావడంతో విమ్ స్ లోనే చేర్చడం జరిగింది. ఈయన కుమార్తె శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక స్టాఫ్ నర్సు గా చేస్తున్నారు. ఆమె

ప్రతి రోజూ తండ్రి ఆరోగ్యం పై ఆరా తీసినా, ఒక్కరు నోరెత్తని కారణంగా వైద్య మందుల కిట్ ను శ్రీకాకుళం నుంచి ఆమె విమ్ స్ కు పంపించిన వాటిని సిబ్బంది నిర్లక్ష్యంగా పారెయ్యడంతో కనీసం మందులు కూడా అందక అయన మరణించిన విషయం తెలిసిందే. అయన బంధువులు మంత్రిని నిలదియ్యడంతో వైద్యులు మాట దాటేసే ప్రయత్నం చేయడం

జరిగింది. 

మొత్తానికి మంత్రి విమ్ స్ పర్యటన ఇబ్బందికరంగా మారింది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam