DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పేషెంట్లకు భరోసా కల్పిస్తాం: మంత్రి చెల్లి బోయిన 

DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)

అమరావతి, ఆగస్టు 03, 2020 (డిఎన్ఎస్): కరోనా పాజిటివ్ పేషెంట్లకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లి బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి, సబ్ కలెక్టర్ మరియు మున్సిపల్ కార్పొరేషన్

కమిషనర్ అభిషి క్త్  కిషోర్లతో  కలిసి తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు లోని కోవిద్ కేర్ సెంటర్ ను సందర్శించి పలు విభాగాలను పరిశీలించారు, వైద్య అధికారుల నుండి వైద్య, ఆహార సదుపాయాల నాణ్యతపై ఆరా తీశారు. గదుల్లో వైద్యం పొందుతున్న పేషెంట్లతో ముఖాముఖి మాట్లాడుతూ వైద్యం,  ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం పై సమస్యలను  అడిగి

తెలుసుకున్నారు.ఈ సెంటర్లో భోజన సదుపాయాలు నాణ్యతని పరిశీలిస్తూ ఆహార పదార్థాల ను స్వీకరించి రుచి చూశారు.
 
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కేసులు పెరిగేకొద్దీ రక్షణ,  సహాయ చర్యలు వేగవంతం చేస్తున్నామని, ప్రభుత్వం ప్రజలకు పూర్తిగా అండగా ఉంటుందని ఇకపై డివిజన్ స్థాయిలో కూడా సి సి సి సెంటర్ లు

బొమ్మూరు కోవిద్ కేర్ సెంటర్ లో  భోజనాన్ని పరిశీలించారు.  

రామచంద్రా పురం డివిజన్ లో. . .

రామచంద్రపురం డివిజన్లో ఆసుపత్రులకు అందుబాటులో ఉండేలా కోవిద్ కేర్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుందన్నారు.  అన్ని  ఆక్సిజన్, వైద్య సదుపాయాలతో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లా యంత్రాంగం

క్రింది స్థాయి నుండి జిల్లా కలెక్టర్ వరకూ విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. 

జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కరోనా సహాయ చర్యలు మంత్రివర్యుల కు వివరిస్తూ, అమలాపురం కాకినాడ రాజమహేంద్రవరం లో 7500 పడకలు సిద్ధం చేస్తున్నామని, బొమ్మూరు లో మూడువేల పడగలు లక్ష్యం కాగా ప్రస్తుతం 1500 పడగల సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఈ సెంటర్లో సోమవారం ఉదయానికి1182 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రంపచోడవరం లో వెయ్యి పడకల కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మార్గాన్ని భరత్ రామ్, జిల్లా అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్  పేయి, వైద్యాధికారులు మంత్రి తో ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam