DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ ను ప్రశ్నించే అర్హత అసలు అక్రమాల గంటా కు ఉందా ? : జనసేన 

విశాఖపట్నం, జూలై 12, 2018  (డిఎన్‌ఎస్‌) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడమే కాదు, కనీసం అయన ముందు నిలబడే అర్హత రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾

(అక్రమాల) శ్రీనివాసరావు కు లేదని, జనసేన ఉత్తరాంధ్ర సమన్వయ కర్త శివశంకర్ ఎద్దేవా చేశారు. గురువారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పర్యటనలో వెలుగు చూసిన అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు చేసిన భూకబ్జాలు, అవినీతి, అక్రమాలను బహిర్గతం చేసి,

ప్రశ్నించడం తో గంటాకు మింగుడు పడలేదన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని తెలుగుదేశం ఎమ్మెల్యే లు చేసిన అక్రమాలను బహిరంగంగా ప్రశ్నించడం

తో కలుగులోని ఎలకలు బయటకు వచ్చాయన్నారు. వందల ఎకరాల భూములు స్వాహా చేసిన మాట వాస్తవమా కాదా, టీచర్ పోస్ట్ ల నియామకం లో పోస్టు కి ఐదు లక్షల రూపాయలు మీ కుటుంబ సభ్యులు

వసూలు చేయడం నిజమా కాదా అని ప్రశ్నించారు. à°—à°‚à°Ÿà°¾ పవన్ కు వదిలిన 25 ప్రశ్నవళి ని  à°¤à°¿à°°à±à°—ు టపా లో శివశంకర్ పంపేశారు. 
ఈ రాష్ట్రానికి బోలెడు నిధులు ఇచ్చామని కేంద్రం

చెప్తోంది, అసలు విడుదలే కాలేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా తరుణంలో వాస్తవాలు ప్రజలకు తెలియచేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు, మాజీ ఎంపీ, న్యాయ

నిపుణులతో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ని ఏర్పాటు చేసి వారితో వాస్తవాలను ప్రకటించారు తప్ప, కేంద్రం తో పోరాడతామని చెప్పలేదన్నారు. అయితే దీన్ని గంటా ప్రశ్నించడం

వెటకారం à°—à°¾ ఉందన్నారు. à°ˆ క్రమంలోనే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు చేసిన అక్రమాలపై శివశంకర్ 25  à°ªà±à°°à°¶à±à°¨à°²à°¨à± సూటిగా ప్రశ్నించారు. దీనికి à°—à°‚à°Ÿà°¾ వెంటనే సమాధానం చెప్పి, తన

చిత్తశుద్ధి ని చాటుకోవాలన్నారు. వాటిల్లో ప్రధానమైనవి..... 

విశాఖ ప్రాంతాల్లో వెలుగు చూసిన భూ కబ్జాల్లో నీ పాత్ర ఎంత ?

మంత్రి అయ్యన్న పాత్రుడు

ఆరోపించిన భూ కుంభకోణాలలో నీ పాత్ర ఎంత ? దీనికోసమే సిట్ కమిటీ నియమించింది వాస్తవమా కాదా, సిట్ ఇచ్చిన నివేదిక లో నీ పాత్ర వెలుగు చూసింది వాస్తవమా కాదా, అందుకే ఆ

నివేదిక బయట పెట్టకుండా చంద్రబాబుతో లాలూచి పడడం నిజం కాదా అని ప్రశ్నించారు. 

భీమిలి లో నీ సమీప బంధువు భాస్కర రావు షాడో గా వ్యవహరించింది వాస్తవం

కాదా, 

ఈ ప్రాంతాల్లో జరిగిన ప్రతీ కుంభకోణం లోనూ నీకు పాత్ర లేదా ?

పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన చోట్ల అందరూ గెలిచారు, ఈ విషయమే మీ ముఖ్యమంత్రి చంద్రబాబే

బహిరంగంగా ఒప్పుకున్నారా లేదా అని సూటిగా ప్రశ్నించారు. గెలిస్తే మీ గొప్ప, ఓడిపోతే పవన్ భాద్యత ?

కాపు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టి

తర్వాత మీరు ఏమి చేశారు, మంజునాధ్ కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా కూడా ఆగలేదు, పైగా à°ˆ జాప్యం కేంద్రం పై నెట్టేయడం ఏంటని అడిగారు. 

మీ బంధువులతో కలిసి చేసిన భూ

ఆక్రమణలు చిట్టా చిత్రగుప్తుడు పద్దు à°…à°‚à°¤ ఉండదా అని అడిగారు, 

ఎయిడెడ్ కళాశాలల్లో టీచర్ల పోస్టులు ఇస్తామని ఒక్కొక్కరి దగ్గరా ఐదు లక్షలు మీ కుటుంబ

సభ్యులు వసూలు చెయ్యలేదా ? అని ప్రశ్నించారు. 

కళాశాలలకు అనుమతి ఇస్తామని లక్షలు వసూలు చేసింది వాస్తవమా కాదా ?
ఇలా చెప్పుకుంటూ పొతే గంటా అక్రమాల సంఖ్యా

పెరుగుతూనే ఉంటుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam