DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం ప్రోజక్ట్ లో చోరీ కేసులో ముద్దాయి అరెస్ట్. . .

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 07, 2020 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జరిగిన భారీ చోరీ కేసులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీ కేసులో పోలవరం పోలీసు స్టేషన్ లో రిపోర్ట్ చేసిన  12 గంటలలో ముద్దాయిని అరెస్టు చేసిన పోలవరం సిబ్బందిని పశ్చిమ

గోదావరి జిల్లా ఎస్పీ కె. నారాయణ్ నాయక్ అభినందించారు.  
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఇతర జిల్లాల యొక్క పోలీస్ అధికారుల తో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అధికారులకు ఎస్పీ ఆదేశాలు ఇచ్చినారు. దాని పై   పోలవరం డి .ఎస్.పి ఎం. వెంకటేశ్వరరావు ప్రత్యేక పర్యవేక్షణలో  పోలవరం సిఐ ఏ.ఎన్.ఎన్.మూర్తి, ఎస్సై

శ్రీనివాస్, బుట్టాయిగూడెం ఎస్ఐ సిబ్బంది పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆఫీసులో జరిగిన దొంగతనాన్ని ఛేదించారు. గురువారం గుర్తుతెలియని దొంగలు  ఆఫీస్ లోకి ప్రవేశించి సదరు ఆఫీసులో ప్రాజెక్ట్ కార్మికుల యొక్క జీతము కొరకు ఉంచిన 52,26,016/-  రూపాయలను  దొంగలించు కొనిపోయినా విషయంపై పోలవరం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 152

/2020 యూ/ఎస్ 457&380 ఐ.పి.సి గా కేసు నమోదు పరిచిన  వెంటనే అధికారులు నేర  స్థలాన్ని సందర్శించి, నేర స్థలము ను  క్షుణ్ణంగా పరిశీలన చేసిన నేరము జరిగిన ప్రదేశమును  సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసిన  12 గంటలలో ఈ కేసును చేదించి  ముద్దాయి పుష్పగిరి మధుసూదన రెడ్డి తండ్రి గోవిందరెడ్డి

 శంకవరంపాడు అద్దంకి మండలం ప్రకాశం జిల్లా అనే పోలవరం ప్రాజెక్టు సెక్యూరిటీ గార్డు అను అతను  నేరం చేసిన అనంతరము ముద్దాయి లెబర్ క్యాంప్ మేస్ వద్ద ఉన్న మోటర్ సైకిలు దింగిలించుకొని  పారిపోయినట్లు, మోటర్ సైకిల్ ను రాజమహింద్రవరము లో గుర్తించినట్లు, అంతటా ముద్దాయి నీ అద్దంకి లో ఒక లాడ్జి లో వుండగా   అరెస్టు చేసి

అతని  వద్ద నుండి దొంగిలించబడిన టువంటి 52,20,700/-   రూపాయలను సిఐ రికవరీ చేసిన విషయంపై జిల్లా ఎస్పీ కె.నారాయణ్ నాయక్, పోలవరం సిఐని, పోలవరం ఎస్ఐ మరియు బుట్టాయిగూడెం ఎస్ఐ లను, సిబ్బందిని అందరినీ అభినందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam