DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రాధమిక దశలో వైద్య సేవల ద్వారా కరోనా నియంత్రణ

*జెడ్పి సమీక్షలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డా.  జె.నివాస్*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 07, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లాలో ప్రాధమిక దశలోనే వైద్య సేవలందించడం ద్వారా కరోనా నియంత్రణ  సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు.

 శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ  పరిధిలోని సచివాలయ ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ కరోనా నియంత్రణపై సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా  నేపధ్యంలో  ప్రతీ రోజూ ఇంటింటి సర్వే జరపాలన్నారు. వాలంటీర్ల పాత్ర కీలకమైనదన్నారు.  జ్వరం, ఆయాసం, శ్వాస

తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నవారిని గుర్తించాలన్నారు. ఈ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం వున్నా వారిపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలన్నారు. వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.  ఈ విషయంలో అలసత్వం వద్దన్నారు. ఆక్సిజన్ స్ధాయి 94 శాతం కన్నా తక్కువగా వున్నా చాలా ప్రమాదకరమన్నారు.  ఈ విషయాలను

ముందుగా ప్రత్యేక అధికారులు క్షుణ్ణంగా తెలుసుకుని వాలంటీర్లకు అవగాహన కలిగించాలన్నారు.  ఆషా వర్కర్లు వారానికి ఒక స్టిక్కరు చొప్పున ప్రతీ ఇంటికి అంటించాలన్నారు.   ఆసుపత్రికి తరలించడానికి వెహికల్ కి ఫోన్ చేసి తక్షణమే వారికి వైద్య సహాయం అందించాలన్నారు.  కోవిడ్ కారణంగా మరణాలు సంభవించరాదన్నారు. ప్రతీ రోజు కేసులు

పెరిగిపోతున్నాయని, గురువారం నాడు 232 కేసులు వచ్చాయని తెలిపారు.  రాత్రి పూట ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. జ్వరాలు వున్న ప్రాంతాలలో ఎక్కువ సాంపిల్స్ తీసుకోవాలన్నారు.   హోమ్ ఐసోలేషన్ లో వున్న వారికి అవసరమైన మందులు, మాస్కులు అందించాలన్నారు.  యంత్రాంగం మొత్తం కరోనా కట్టడి  పైనే పని చేస్తున్నదని తెలిపారు.  రూరల్,

అర్బన్ ప్రాంతాలకు వాహనాలను సమకూర్చడం జరిగిందన్నారు. సర్వే ఫార్మెట్ ను ప్రతీ రోజు వాలంటీర్లకు ఇవ్వాలన్నారు.  వాలంటీర్ల పని తీరును ప్రతీ రోజు పర్యవేక్షణ చేయాలన్నారు.  ప్రజల ప్రాణాలను రక్షించే బాధ్యతతో పని చేయాలన్నారు.    అనంతరం నగరపాలక సంస్ధ కమీషనరు పి.నల్లనయ్య మాట్లాడుతూ, లక్షా 50 వేల మంది ఆరోగ్యాన్ని

పరిరక్షించే బాధ్యత వుందన్నారు.  ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే సేవా సావకాశం ఇప్పుడు వచ్చిందని, సెక్రటేరియట్ ప్రత్యేక అధికారులుగా మంచి సేవలందించి సంస్ధ పేరు నిలపాలన్నారు. 
             ఈ సమావేశంలో కోవిడ్ అర్బన్ స్పెషస్ ఆఫీసరు వరప్రసాదరావు, నగరపాలక సంస్ధ సహాయ కమీషనరు కె.శ్రీనివాస రావు, హెల్త్ ఆఫీసరు

వెంకటరావు, ప్రత్యేక అధికారులు, ఎ.ఇ.లు, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam